Zodiac Signs 2026: 2026లో జాగ్రత్తగా ఉండాల్సిన రాశుల వాళ్లు వీరే..! ఎందుకంటే..
ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. తొందరపాటు నిర్ణయాలు వద్దు. కష్టపడి పని చేస్తే విజయం వరిస్తుంది.
Zodiac Signs 2026: 2026 నూతన సంవత్సరంలో అతి జాగ్రత్తగా ఉండాల్సిన రాశులు ఏంటో, గ్రహాల బలం తక్కువగా ఉన్నప్పటికీ ఏ గ్రహం యోగించటం వల్ల 2026లో సమస్యల నుంచి రక్షింపబడేటువంటి రాశులు ఏంటో తెలుసుకుందాం. 2026 ఆంగ్ల నూతన సంవత్సరంలో ప్రధానంగా నాలుగు రాశుల వాళ్లు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. గ్రహాల బలం అనేది తక్కువగా ఉంది. ఎప్పుడైనా సరే.. ఒక సంవత్సరం మొత్తం ఏ రాశుల వాళ్లు జాగ్రత్తగా ఉండాలి అనే విషయం తెలియాలంటే.. ప్రధానంగా నాలుగు గ్రహాలలో ఎన్ని గ్రహాలో యోగిస్తున్నాయో చూసుకోవాలి.
సంవత్సర ఫలితాలు ఎప్పుడూ కూడా రాహువు, కేతువు, గురువు, శని.. ఈ నాలుగు గ్రహాల సంచారం బట్టే చెబుతారు. ఈ నాలుగు గ్రహాలలో ఎవరికైనా మూడు గ్రహాలు యోగిస్తే అఖండ రాయోజగం. రెండు గ్రహాలే యోగిస్తే అదృష్టం. ఒకే ఒక్క గ్రహం యోగిస్తే మాత్రం ఆ రాశుల వాళ్లు అతి జాగ్రత్తగా ఉండాలి. అంటే ఆచితూచి ప్రతి విషయంలో జాగ్రత్తగా అడుగులు వేయాలి. ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి.
2026 కొత్త ఏడాదిలో అతి జాగ్రత్తగా ఉండాల్సిన రాశులలో.. మొట్టమొదటిది.. కర్కాటక రాశి. దీనికి కారణం.. కొత్త ఏడాదిలో కర్కాటక రాశివారికి గురుగ్రహం ఒక్కటే యోగిస్తోంది. నాలుగు దీర్ఘకాల గ్రహాల్లో గురు గ్రహం ఒక్కటే యోగిస్తోంది. అది కూడా కేవలం రెండు నెలలు మాత్రమే. సంవత్సరం చివరలో అంటే నవంబర్, డిసెంబర్. ఈ ఒక్కటే ఏడాదితో రక్షగా ఉంటుంది.
కర్కాటక రాశి వారికి సంవత్సరం మొత్తం శని బలం లేదు. శని 9వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. అలాడే రాహువు, కేతువుల బలం కూడా లేదు. రాహువు, కేతువు, శని.. ఏడాది చివరవరకు యోగించడం లేదు. అందుకే కర్కాటక రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇష్ట దేవత ఆరాధన చేసుకోవాలి. దేవాలయ దర్శనం చేసుకోవాలి. సంవత్సరం చివరలో మాత్రం వీరికి గురు బలం రక్షగా ఉంటుంది.
2026లో జాగ్రత్తగా ఉండాల్సిన రెండో రాశి సింహరాశి..
2026లో జాగ్రత్తగా ఉండాల్సిన రెండో రాశి సింహరాశి. వీరికి కూడా ఒకే ఒక్క గ్రహం యోగిస్తోంది. అది దేవ గురువైన బృహస్పతి. గురువు 5 నెలల పాటు 2026లో సింహరాశి వారికి యోగిస్తాడు. శని యోగించడు. అష్టమ శని దోషం నడుస్తోంది. అలాగే రాహు, కేతువులు యోగించరు. రాహువు, కేతువు, శని బలం లేదు. కేవలం గురు బలం ఒక్కటే ఉంది. అదే 2026లో ఒక రక్షలా కాపాడుతుంటుంది. గురు బలం కాపాడుతూ ఉంటుంది కాబట్టి భయపడాల్సిన పని లేదు. కాకపోతే ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. తొందరపాటు నిర్ణయాలు వద్దు. కష్టపడి పని చేస్తే విజయం వరిస్తుంది.
2026లో జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాల్సిన మూడో రాశి.. కుంభ రాశి. ఈ రాశి వారికి ఒకే ఒక్క గ్రహం యోగిస్తోంది. అది గురు గ్రహం. అయితే, గురు గ్రహం కుంభరాశి వారికి 7 నెలల పాటు యోగిస్తుంది. ఇది చాలా అద్భుతం. కాబట్టి కుంభ రాశి వాళ్లు పెద్దగా దిగులు పడాల్సిన అవసరం ఏమీ లేదు. ఎందుకంటే గురు బలం 7 నెలల పాటు మీకు రక్షగా ఉంటుంది. కానీ, ఏలినాటి శని దోషం ఉంది. శని, రాహు, కేతువులు యోగించడం లేదు. గురు బలం మాత్రం 7 నెలల పాటు అద్భుతంగా యోగిస్తోంది. గురు బలం ఒక రక్షలా కాపాడుతుంది. అది రక్షలా ఉన్నా మిగిలిన మూడు గ్రహాలు యోగించడం లేదు కాబట్టి ఏ విషయంలోనైనా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. కుటుంబసభ్యులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి. అలాగే ధనం ఖర్చు పెట్టేటప్పుడు ఆలోచించి ఖర్చు పెట్టాలి.
ఎదుటి వారితో శత్రుత్వాలు రాకుండా జాగ్రత్తగా మాట్లాడాలి..
2026లో కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన రాశి మేషరాశి. ఎందుకంటే ఈ రాశి వాళ్లకి రెండు గ్రహాలు యోగిస్తున్నాయి కానీ, గురువు కేవలం 2 నెలలే యోగిస్తున్నాడు. సంవత్సరం చివరలో నవంబర్, డిసెంబర్ లో మాత్రమే గురుబలం ఉంది. కానీ, ఏడాది మొత్తం రక్షించే గ్రహం రాహు గ్రహం. ఏలినాటి శని దోషం ఉంది. అంటే సంవత్సరం మొత్తం శని, కేతువు యోగించడం లేదు. గురువు అక్టోబర్ నెల వరకు యోగించడం లేదు. అంటే సంవత్సరం మొత్తం కాపాడే గ్రహం రాహు గ్రహం. 2026 సంవత్సరంలో డిసెంబర్ 5 వరకు రాహు గ్రహం రక్షిస్తూ ఉంటుంది. లాభ స్థానంలో ఉంది. కాబట్టి మేషరాశి వాళ్లు ఎదుటి వారితో శత్రుత్వాలు రాకుండా జాగ్రత్తగా మాట్లాడాలి. ఆరోగ్యపరమైన విషయాల్లో ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. ఒకటికి పదిసార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి.
అతి జాగ్రత్తగా ఉండాల్సిన రాశులలో కుంభ రాశి, మేషరాశి కొంతవరకు అనుకూలమనే చెప్పాలి. పెద్దగా ఆందోళన చెందాల్సిన పని లేదు. కుంభరాశి వారికి 7 నెలల పాటు గురు బలం ఒక రక్షలాగా కాపాడుతోంది. మేష రాశి వాళ్లకి ఏడాది మొత్తం రాహు బలం ఉండటంతో పాటు ఏడాది చివరలో రెండు నెలలు గురు బలం రక్షలాగా కాపాడుతుంది.
అతి జాగ్రత్తగా ఉండాల్సిన రాశి మాత్రం కర్కాటక రాశే..
అతి జాగ్రత్తగా ఉండాల్సిన రాశి మాత్రం కర్కాటక రాశే. ఎందుకంటే నాలుగు గ్రహాల్లో మూడు గ్రహాలు యోగించడం లేదు. గురు బలం కూడా చివరి రెండు నెలల్లోనే వస్తోంది. సింహ రాశి వాళ్లకి కూడా 5 నెలల పాటు గురువు కాపాడుతున్నాడు. 2026లో అతి జాగ్రత్తగా ఉండాల్సిన నాలుగు రాశుల్లో మొట్టమొదటి రాశి కర్కాటక రాశి. కార్కాటక రాశి వారు ప్రతిదీ జాగ్రత్తగా ఆలోచించి అడుగులు వేయాలి. ఆ తర్వాత సింహ రాశి పర్వాలేదు. ఆ తర్వాత కుంభ(గురు బలం కాపాడుతుంది), మేషరాశి (రాహు బలం, చివరలో గురు బలం కాపాడుతుంది) వాళ్లు కొంచెం ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే అనుకూల ఫలితాలు పొందొచ్చు.
Also Read: 2026లో జరిగే అద్భుతాలు ఇవే.. మానవసహిత చంద్రయాత్ర, ఫిఫా వరల్డ్ కప్.. ప్రపంచంలో భారీ మార్పులు..
