AP Govt : ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఉద్యోగులకు గుడ్‌న్యూస్..

AP Govt : ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ఉద్యోగులకు గుడ్‌న్యూస్ చెప్పింది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఛైల్డ్‌కేర్‌ లీవ్‌ల వినియోగంలో

AP Govt : ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఉద్యోగులకు గుడ్‌న్యూస్..

Updated On : December 16, 2025 / 7:03 PM IST

AP Govt : ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ఉద్యోగులకు గుడ్‌న్యూస్ చెప్పింది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఛైల్డ్‌కేర్‌ లీవ్‌ల వినియోగంలో మరిన్ని సడలింపులు చేసిన ప్రభుత్వం.. ఉద్యోగుల విన్నపాల మేరకు వారికి అనువుగా నిబంధనలు సడలిస్తూ ఆదేశాలు జారీచేసింది.

Also Read : AP TDP : జిల్లాల వారీగా టీడీపీ నూతన అధ్యక్షులు వీరే..? వారికి అధిక ప్రాధాన్యత

మహిళా ఉద్యోగులతో పాటు ఒంటరి పురుష ఉద్యోగి ఛైల్డ్‌కేర్ లీవ్ వినియోగించుకునే అవకాశం కల్పించింది. పిల్లల వయసు పరిమితి తొలగించి, వయసుతో సంబంధం లేకుండా ఛైల్డ్‌కేర్ లీవ్‌లు వినియోగించుకునేలా మార్పులు చేసింది.

పదవీ విరమణ ముందు వరకూ చైల్డ్‌కేర్ లీవ్‌లను వినియోగించుకునే సదుపాయం కల్పించిన ప్రభుత్వం.. వికలాంగులైన పిల్లలకోసం ఛైల్డ్ లీవ్‌ను వినియోగించుకునేలా అవకాశం కల్పించింది. ప్రభుత్వ పాఠశాల, కళాశాలల్లో చదివే పిల్లలు, అనారోగ్యం, పిల్లల సంరక్షణ కోసం ఛైల్డ్‌కేర్ లీవ్‌లు వినియోగించుకునే అవకాశం ఉంటుంది.

180 రోజుల చైల్డ్ కేర్ లీవ్‌ను గరిష్టంగా 10సార్లు వినియోగించుకుంటోన్న రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు .. గతం ఉత్తర్వులు అమలుతో పాటు అదనంగా సడలింపు ఇస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఛైల్డ్ కేర్ లీవ్‌పై ఉత్తర్వులు వెంటనే అమల్లోకి వస్తాయని స్పష్టం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలను ఆర్ధిక శాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్ జారీ చేశారు.