విశాఖ శారదా పీఠంలో సీఎం జగన్

ఏపీ సీఎం వైఎస్‌ జగన్ విశాఖలోని శారదా పీఠం చేరుకున్నారు. సోమవారం(ఫిబ్రవరి 03,2020) శ్రీ శారదాపీఠం వార్షికోత్సవాల్లో జగన్ పాల్గొననున్నారు. రాజశ్యామల అమ్మవారికి జగన్

  • Publish Date - February 3, 2020 / 06:13 AM IST

ఏపీ సీఎం వైఎస్‌ జగన్ విశాఖలోని శారదా పీఠం చేరుకున్నారు. సోమవారం(ఫిబ్రవరి 03,2020) శ్రీ శారదాపీఠం వార్షికోత్సవాల్లో జగన్ పాల్గొననున్నారు. రాజశ్యామల అమ్మవారికి జగన్

ఏపీ సీఎం వైఎస్‌ జగన్ విశాఖలోని శారదా పీఠం చేరుకున్నారు. సోమవారం(ఫిబ్రవరి 03,2020) శ్రీ శారదాపీఠం వార్షికోత్సవాల్లో జగన్ పాల్గొననున్నారు. రాజశ్యామల అమ్మవారికి జగన్ పూజలు నిర్వహించనున్నారు. ఆగమ యాగశాలలో ఐదు రోజులుగా విశ్వశాంతి హోమం జరుగుతోంది. ఈ హోమం పూర్ణాహుతిలో జగన్ పాల్గొంటారు. స్వయంజ్యోతి మండపాన్ని ప్రారంభిస్తారు.

ఉదయం 9 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరిన సీఎం జగన్‌ 9.20 గంటలకు గన్నవరం విమానాశ్రయం చేరుకున్నారు. అక్కడి నుంచి  విమానంలో బయలుదేరి 10.10 గంటలకు విశాఖ విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో 10.40 గంటలకు చినముషిడివాడలోని శారదా పీఠానికి వచ్చారు.

మధ్యాహ్నం 12.30 గంటల వరకు శ్రీ శారదా పీఠం వార్షిక మహోత్సవ ముగింపు కార్యక్రమాల్లో సీఎం పాల్గొంటారు. అనంతరం శారదాపీఠం నుంచి 12.50కి సీఎం జగన్‌ విశాఖ విమానాశ్రయానికి బయలుదేరుతారు. మధ్యాహ్నం 2.10 గంటలకు తాడేపల్లిలోని స్వగృహానికి చేరుకుంటారు.

* విశాఖలో ఏపీ సీఎం వైఎస్‌ జగన్
* శ్రీ శారదాపీఠం వార్షికోత్సవాల్లో పాల్గొన్న జగన్
* వార్షికోత్సవం సందర్భంగా విశ్వ శాంతి మహా యాగం, పూర్ణాహుతి
* రాజశ్యామల అమ్మవారికి జగన్ పూజలు

* ఆగమ యాగశాలలో ఐదురోజులుగా విశ్వశాంతి హోమం
* స్వయంజ్యోతి మండపాన్ని ప్రారంభించనున్న జగన్
* సీఎం హోదాలో శారదాపీఠానికి రెండోసారి జగన్