Pawan Kalyan : ఎల్జీ పాలీమర్స్ బాధితులకు న్యాయం చేయలేని సీఎం రాజధానితో ఏం న్యాయం చేస్తారు : పవన్ కళ్యాణ్

విశాఖను రాజధాని కన్నా ముందు, విష వాయువు రహిత ప్రాంతంగా మార్చాలని సూచించారు. కోటి రూపాయలు ఇస్తే సమస్య పరిష్కారం అయినట్టు కాదని తెలిపారు.

Pawan Kalyan

Pawan Kalyan – CM Jagan : సీఎం జగన్ పై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఫైర్ అయ్యారు. ఎల్జీ పాలీమర్స్ బాధితులకు న్యాయం చేయలేని ముఖ్యమంత్రి రాజధానితో ఏమి న్యాయం చేస్తారని ప్రశ్నించారు. ఎల్జీ పాలిమర్స్ లో 1800 మంది ఎఫెక్ట్ అయ్యారని పవన్ కళ్యాణ్ తెలిపారు. ప్రత్యేక అరోగ్య కార్డులతో ఎలాంటి ప్రయోజనం లేదన్నారు.

గురువారం విశాఖ జనవాణి కార్యక్రమంలో ఎల్జీ పాలిమర్స్ బాధితులు పాల్గొన్నారు. మూడు సంవత్సరాలుగా ఆరోగ్య పరమైన సమస్యలతో ఇబ్బంది పడుతున్నామని వెంకటాపురం గ్రామస్తులు పవన్ కళ్యాణ్ ముందు వాపోయారు. ప్రభుత్వం తమకు ఎలాంటి సహకరం చేయడం లేదని చెప్పారు.

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ అభిమాని అత్యుత్సాహం.. బిడ్డని తీసుకోవాలంటూ..

ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఎల్జీ పాలిమర్స్ బాధితుల విషయంలో జిల్లా కలెక్టర్ బాధ్యత తీసుకోవాలని కోరారు. విశాఖను రాజధాని కన్నా ముందు, విష వాయువు రహిత ప్రాంతంగా మార్చాలని సూచించారు. కోటి రూపాయలు ఇస్తే సమస్య పరిష్కారం అయినట్టు కాదని తెలిపారు. ఉత్తరాంధ్రాను కాలుష్యంతో నింపేస్తున్నావని పవన్ ఆరోపించారు.