Budget 2022: ఏపీకీ కేటాయింపుల్లేవని అడుగుతూ ప్రధానికి సీఎం జగన్ లేఖ

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ పై ప్రధాని మోదీకి లేఖ రాశారు సీఎం జగన్. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక కేటాయింపులు లేకపోవడంతో పెండింగ్ లో ఉన్న సమస్యలు...

Cm Jagan Prc

Budget 2022: కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ పై ప్రధాని మోదీకి లేఖ రాశారు సీఎం జగన్. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక కేటాయింపులు లేకపోవడంతో పెండింగ్ లో ఉన్న సమస్యలు లేవనెత్తుతూ లేఖలో పేర్కొన్నారు.

‘విభజన తర్వాత రాష్ట్ర ఆదాయం భారీగా కోల్పోయింది. రాష్ట్రాన్ని కేంద్ర సహకారం చాలా అవసరం. పోలవరం నిధులు, రెవెన్యూ లోటు సహా ఇతర అంశాలకు పరిష్కారం చూపించండి’ అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సీఎం జగన్ లేఖ రాశారు.

మరోవైపు పీఆర్సీపై ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులంతా నిరసన గళమెత్తారు. ఉద్యోగ సంఘాలు చేపట్టిన చలో విజయవాడ కార్యక్రమం ముగిసింది. ఇకపై మంత్రుల కమిటితో చర్చలు జరిపేది లేదని స్టీరింగ్ కమిటీ సభ్యులు తేల్చి చెప్పారు. సీఎం జగన్‌తో తప్ప మరెవరితో చర్చలు జరపబోమని స్పష్టం చేశారు. సీఎం జగన్ ముందుకొచ్చి ఈ అంశాన్ని పరిశీలించాలని కోరారు.

Read Also : ఏపీకి బిగ్ రిలీఫ్.. భారీగా తగ్గిన కరోనా కేసులు

ఛలో విజయవాడ సందర్భంగా నిర్బంధించిన ఉద్యోగులను వెంటనే విడిచిపెట్టాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వంతో తాము ఘర్షణ వాతావరణం కోరుకోవడంలేదన్నారు. మూడేళ్లుగా తమ ఆవేదనలు ప్రభుత్వానికి చెప్పాం.. అయినా ప్రభుత్వం పట్టించుకోలేదు.. అవమానపరిచారని స్టీరింగ్‌ కమిటి పేర్కొంది.