ఇచ్చిన మాట ప్రకారం హామీలు నెరవేర్చకుంటూ వస్తున్నాం..పాదయాత్రలో మత్స్యకారుల విషయంలో తానిచ్చిన హమీ మేరకు రూ. 10 వేలు నేరుగా వారి బ్యాంకు ఖాతాలో వేస్తున్నామన్నారు సీఎం జగన్. గత ప్రభుత్వం చేపల వేట నిషేధం సమయంలో రూ. 4 వేలు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. ఏప్రిల్ 15 నుంచి జూన్ 14వ తేదీ వరకు చేపల వేట నిషేధం ఉంటుందన్నారు.
లక్షకు పైగా ఉన్న మత్స్యకారుల కుటుంబాలకు లబ్ది చేకూరనుందన్నారు. 2019, నవంబర్ 21 గురువారం ముమ్మడివరంలో వైఎస్సార్ మత్స్యకార భరోసా పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ…పాదయాత్రలో మత్స్యకారుల కష్టాలను స్వయంగా చూశానని, ఉపాధి లేక మత్స్యకారులు వలస వెళుతున్నారని తెలిపారు. ఆ పరిస్థితులు నివారించాలని నిర్ణయం తీసుకుని…ఇచ్చిన హామీని నెరవేరుస్తున్నా అని చెప్పడానికి గర్వపడుతున్నట్లు చెప్పారు. ప్రతి మత్స్యకార కుటుంబానికి తోడుగా ఉంటానని మాట ఇవ్వడం జరిగిందని, ఐదు నెలల్లో హామీలను అమలు చేస్తున్నానన్నారు. మత్స్యకారులందరికీ ఐడెంటిడీ కార్డులను ఇచ్చామన్నారు సీఎం జగన్.
మత్స్యకారులకు భరోసా…
> మత్స్యకారులకు డీజిల్ రాయితీ రూ. 6.03 నుంచి రూ. 9కి పెంపు.
> ప్రమాదవశాత్తు మరణించే మత్స్యకారుల కుటుంబానికి రూ. 10 లక్షల సాయం.
> 16 వేల 500 మత్స్యకార కుటుంబాలకు రూ. 78 కోట్ల 24 లక్షలు ONGC బకాయిలు చెల్లింపు.
> ఏప్రిల్ 15 నుంచి జూన్ 14వ తేదీ వరకు చేపల వేట నిషేధం.