Comedian Ali: పదవులు కోసం పనిచేయలేదు.. త్వరలో శుభవార్త! -అలీ

పదవులు ఆశించకుండా పార్టీ కోసం నిజాయితిగా పనిచేసినట్లు చెప్పారు కమెడీయన్ అలీ.

Ali

Comedian Ali: పదవులు ఆశించకుండా పార్టీ కోసం నిజాయితిగా పనిచేసినట్లు చెప్పారు కమెడీయన్ అలీ. జగన్‌తో తనకు చాలా పాత పరిచయం ఉందని, వైఎస్ఆర్ ఉన్నప్పటి నుంచి జగన్ తనకు తెలుసునని అన్నారు అలీ.

ఇటీవల మా పెళ్లి రోజున రావాలని అనుకున్నా కుదరలేదని ఇప్పుడు అవకాశం రావడంతో సతీసమేతంగా వచ్చినట్లు చెప్పారు.గత ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ ఇస్తామని అన్నారని, కానీ, టైం తక్కువ ఉండడంతో వద్దని చెప్పినట్లు చెప్పారు.

ఎమ్మెల్యే అంటే గ్రౌండ్ వర్క్ చెయ్యాలి. ఫేస్ వాల్యూ బట్టి అవ్వదని అన్నారు. ఈరోజు జగన్‌తో భేటి పూర్తిగా వ్యక్తిగతమని అన్నారు. ఇదే సమయంలో సినీ ప్రముఖులని అవమాన పరచాల్సిన అవసరం జగన్‌కి ఏముందని ప్రశ్నించారు అలీ.

సినీ ప్రముఖులకు ఇవ్వాల్సిన గౌరవం సీఎం జగన్ ఇస్తున్నారని అభిప్రాయపడ్డారు. గౌరవం ఇవ్వలేదని, కావాలని తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు. చిన్న, పెద్ద సినిమాలకు ఇబ్బంది లేకుండా సీఎం నిర్ణయం తీసుకుంటారని అన్నారు.

అతిత్వరలో పార్టీ ఆఫీస్ నుండి శుభవార్త వస్తుందని చెప్పారు అలీ. అయితే, ఏమిస్తారో తనకు కూడా చెప్పలేదని, నేనెప్పుడు పదవులు ఆశించలేదని అన్నారు.