కరోనా జాగ్రత్త, ఇంట్లోకి రాకుండా భర్తను అడ్డుకున్న భార్య, మంచి పని చేశావని అంతా మెచ్చుకున్నారు

కరోనా వైరస్.. యావత్ ప్రపంచాన్ని వణికిస్తోంది. 200కు పైగా దేశాల ప్రజలకు నిద్ర లేకుండా చేస్తోంది. ఎప్పుడు ఎటువైపు నుంచి కరోనా అటాక్ చేస్తుందోనని అంతా

  • Publish Date - April 17, 2020 / 07:08 AM IST

కరోనా వైరస్.. యావత్ ప్రపంచాన్ని వణికిస్తోంది. 200కు పైగా దేశాల ప్రజలకు నిద్ర లేకుండా చేస్తోంది. ఎప్పుడు ఎటువైపు నుంచి కరోనా అటాక్ చేస్తుందోనని అంతా

కరోనా వైరస్.. యావత్ ప్రపంచాన్ని వణికిస్తోంది. 200కు పైగా దేశాల ప్రజలకు నిద్ర లేకుండా చేస్తోంది. ఎప్పుడు ఎటువైపు నుంచి కరోనా అటాక్ చేస్తుందోనని అంతా హడలిపోతున్నారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నారు. వైరస్ లక్షణాలు కనిపించినా.. వేరే ప్రాంతాల నుంచి ఎవరైనా వచ్చినా వణికిపోవాల్సిన పరిస్థితి నెలకొంది. ముందస్తు జాగ్రత్తగా క్వారంటైన్‌కు తీసుకెళ్లి పరీక్షలు చేస్తున్నారు. రిపోర్టుల్లో నెగిటివ్ అని వస్తేనే రిలాక్స్ అవుతున్నారు. నెల్లూరు జిల్లాలోనూ ఓ మహిళను కరోనా భయం వెంటాడింది. ఆ భయంతో ఆమె కట్టుకున్న భర్తనే ఇంట్లోకి రాకుండా అడ్డుకుంది. 
లాక్‌డౌన్‌తో చిక్కుకుపోయి ఇంటికి వచ్చిన భర్తకు షాక్ ఇచ్చింది. కరోనా పరీక్షలు చేయించుకున్న తర్వాతే ఇంట్లోకి రావాలని తేల్చి చెప్పింది.

వెంకటగిరికి చెందిన మహిళ భర్త నెల్లూరులో బంగారం పనులు చేస్తుంటాడు. లాక్‌డౌన్ ప్రకటించడంతో అక్కడే చిక్కుకుపోయాడు. అతికష్టం మీద రెండు రోజుల క్రితం ఇంటికి చేరుకున్నాడు. ఎలాగో అలా ఇంటికి వస్తే.. మరో కష్టం అతడికి ఎదురైంది. కట్టుకున్న భార్యే భర్తను అడ్డుకుంది. ఇంట్లోకి రానివ్వలేదు. కరోనా పరీక్షలు చేయించుకుని రావాలని.. ఆ తర్వాతే ఇంట్లోకి రానిస్తానని తేల్చి చెప్పింది. అప్పటివరకు అతడిని అంగన్‌వాడీ కేంద్రంలో ఉంచింది. వాలంటీర్ల ద్వారా వైద్య ఆరోగ్య సిబ్బందికి సమాచారం అందించింది.

రంగంలోకి దిగిన ఆరోగ్య సిబ్బంది ఆ వ్యక్తిని ప్రత్యేక వాహనంలో నెల్లూరు తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు. అతడికి ఎలాంటి లక్షణాలు, ప్రభావం లేకపోవడంతో తిరిగి వెంకటగిరిలో ఇంట్లో వదిలేశారు. దీంతో భార్యతో పాటూ స్థానికులూ ఊపిరి పీల్చుకున్నారు. తన భర్త వేరే ఊరి నుంచి వచ్చాడని.. కరోనా ప్రభావం ఉండటంతో.. తన పిల్లలు, ఊళ్లో ప్రజల క్షేమం కోసమే ఇలా చేశానని ఆ భార్య చెబుతోంది.

రూల్ ఈజ్ రూల్ అంటూ లాక్ డౌన్ నిబంధనను కచ్చితంగా ఫాలో అయిన ఆ భార్యను అంతా ప్రశంసిస్తున్నారు. భర్త అయినా కరోనా పరీక్షలు చేయించుకున్నాకే ఇంట్లోకి రానివ్వడం గ్రేట్ అంటున్నారు. ఇలా ప్రతి ఒక్కరు విధిగా, బాధ్యతగా లాక్ డౌన్ రూల్స్ ఫాలో అయితే కరోనాపై విజయం సాధించడం పెద్ద కష్టమేమీ కాదంటున్నారు. తెలంగాణ రాష్ట్రంలోనూ ఇలాంటి ఘటనే జరిగింది. మరో ఊరి నుంచి సొంతూరికి వచ్చిన కన్నతల్లిని గ్రామ సర్పంచ్ అడ్డుకున్నాడు. ఊరి పొలిమేరల్లోనే తల్లిని ఆపేశాడు. తిరిగి అదే ఊరికి వెళ్లిపోవాలని కోరాడు. ఊరి జనం క్షేమమే తనకు ముఖ్యమని ఆ సర్పంచ్ తేల్చి చెప్పాడు. దీంతో ఆ సర్పంచ్ పై ప్రశంసల వర్షం కురిసింది.