COVID-19 Cases AP : ఏపీలో కరోనా, 24 గంటల్లో 14 వేల 429 కేసులు, 103 మంది మృతి
- madhu
- Published On : May 28, 2021 / 05:06 PM IST
Coronavirus A P Reports 14429 New Covid 19 Cases
COVID-19 Cases AP : ఏపీ రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గడం లేదు. మరణాల సంఖ్య కూడా అలాగే ఉంది. తాజాగా..24 గంటల 14 వేల 429 మందికి కరోనా సోకింది. 103 మంది చనిపోయారు. ఈ మేరకు ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది. చిత్తూరు జిల్లాలో 14 మంది మృత్యువాత పడ్డారు. గడిచిన 24 గంటల్లో 20 వేల 746 మంది కోవిడ్ నుంచి పూర్తిగా కోలుకున్నారు.
జిల్లాల వారీగా మృతుల వివరాలు :
చిత్తూరులో 15 మంది, పశ్చిమ గోదావరిలో 15 మంది, విశాఖపట్టణంలో 10 మంది, నెల్లూరులో తొమ్మిది మంది, అనంతపూర్ లో ఎనిమిది మంది, తూర్పు గోదావరిలో ఎనిమిది మంది, కృష్ణాలో ఎనిమిది మంది, గుంటూరులో ఏడుగురు, విజయనగరంలో ఏడుగురు, శ్రీకాకుళంలో ఆరుగురు, వైఎస్ఆర్ కడపలో నలుగురు, కర్నూలులో నలుగురు, ప్రకాశంలో ఇద్దరు మరణించారు.
గడిచిన 24 గంటల్లో 20 వేల 746 మంది కోవిడ్ నుంచి పూర్తిగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యవంతులయ్యారని, నేటి వరకు రాష్ట్రంలో 1,90,09,047 శాంపిల్స్ పరీక్షించినట్లు వెల్లడించింది.
జిల్లాల వారీగా కేసులు :
అనంతపురం 1192. చిత్తూరు 2291. ఈస్ట్ గోదావరి 2022. గుంటూరు 798. వైఎస్ఆర్ కడప 578. కృష్ణా 1092. కర్నూలు 1034. నెల్లూరు 930. ప్రకాశం 924. శ్రీకాకుళం 897. విశాఖపట్టణం 1145. విజయనగరం 535. వెస్ట్ గోదావరి 991. మొత్తం : 14,429.
