రూ.5 కోట్ల విరాళం ఇచ్చిన భారతి సిమెంట్స్‌

  • Publish Date - April 2, 2020 / 08:45 AM IST

ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి ప్రజలను భయపెడుతుంది. ఈ కకర కరోనా విపత్తును ఎదుర్కొనేందుకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంకు సపోర్ట్‌గా పలువురు సాయం చేస్తున్నారు.

సామాన్యుల నుంచి సెలబ్రిటీల దాకా ప్రతి ఒక్కరు తమవంతు సాయం చేస్తుండగా.. ఇప్పటికే పలు కార్పొరేట్‌ సంస్థలు ఏపీకి భారీగా విరాళాలు ప్రకటించాయి.(కరోనా బాధితులకు TIKTOK విరాళం)

ఈ క్రమంలోనే భారతి సిమెంట్‌ కార్పొరేషన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ (బీసీసీపీఎల్‌) తనవంతు సహాయం అందించింది.

కరోనా విపత్తును ఎదుర్కొనేందుకుగాను సీఎం సహాయనిధికి రూ.5 కోట్ల విరాళాన్ని ప్రకటించింది. అలాగే భారతి సిమెంట్స్‌ ఉద్యోగులు 14.5 లక్షల విరాళాన్ని అందజేశారు. వర్షిని చారిటబుల్‌ ట్రస్ట్‌ రూ.1.10 కోట్లు విరాళం ప్రకటించింది.

Also Read | ఐదుగురు కరోనా అనుమానితులు పరారీ.. ఒకరిని అరెస్ట్ చేసిన పోలీసులు