COVID 19 in AP : 24 గంటల్లో 379 కేసులు, ముగ్గురు మృతి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. గత 24 గంటల్లో 379 కరోనా కేసులు నమోదయ్యాయి. ముగ్గురు చనిపోయారు. ఈ మేరకు 2020, డిసెంబర్ 23వ తేదీ బుధవారం సాయంత్రం ప్రభుత్వ

COVID 19 Andhra Pradesh : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. గత 24 గంటల్లో 379 కరోనా కేసులు నమోదయ్యాయి. ముగ్గురు చనిపోయారు. ఈ మేరకు 2020, డిసెంబర్ 23వ తేదీ బుధవారం సాయంత్రం ప్రభుత్వం హెల్త్ బులెటిన్‌లో వెల్లడించింది. మొత్తంగా ఏపీ రాష్ట్రంలో 8 లక్షల 79 వేల 718కి కరోనా కేసులు చేరుకున్నాయి. 7 వేల 085 మంది ఈ వైరస్ బారిన పడి చనిపోయారు. ప్రస్తుతం ఏపీలో 3 వేల 864 యాక్టివ్ కేసులు ఉండగా..8 లక్షల 68 వేల 769 మంది డిశ్చార్జ్ అయ్యారు. చిత్తూరు, వైఎస్ఆర్ జిల్లా కడప, కృష్ణా జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మరణించారు. గడిచిన 24 గంటల్లో 490 మంది కోవిడ్ నుంచి పూర్తిగా కోలుకుని ఇంటికి వెళ్లారు. మొత్తంగా..రాష్ట్రంలో 1,14,15,246 శాంపిల్స్ పరీక్షించారు.

జిల్లాల వారీగా :
అనంతపురం : 19. చిత్తూరు 64. ఈస్ట్ గోదావరి : 35. గుంటూరు : 46. కడప : 33. కృష్ణా : 84. కర్నూలు : 05. నెల్లూరు : 15. ప్రకాశం : 13. శ్రీకాకుళం : 16. విశాఖపట్టణం : 32. విజయనగరం : 14. వెస్ట్ గోదావరి : 13. మొత్తం 379.