ఏపీలో కరోనా గేర్ మార్చింది, నాలుగు లక్షల కేసులను దాటింది

  • Publish Date - August 28, 2020 / 07:30 PM IST

Andhra Pradesh Coronavirus Live Updates: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా విజృంభిస్తోంది.. వైరస్ క్రమక్రమంగా పట్టణాల నుంచి గ్రామాల్లోకి వేగంగా వ్యాపిస్తోంది. మొన్నటివరకూ తగ్గినట్టుగా కనిపించినా కరోనా వైరస్ ఏపీలో గేర్ మార్చేసింది.

పట్టణాల నుంచి గ్రామాల్లోకి వ్యాపించడంతో భారీ సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. కరోనా కేసులతో పాటు మరణాల సంఖ్య కూడా ఎక్కువగానే నమోదవుతున్నాయి. ఏపీలో గత 24 గంటల్లో 61,331 కరోనా శాంపిల్స్ పరీక్షించారు..



వీరిలో 10,526 మందికి కరోనా పాజిటివ్ అని తేలింది. కోవిడ్ వచ్చిన వారిలో చిత్తూరులో 10 మంది, కడపలో 9మంది, నెల్లూరులో 8మంది, ప్రకాశంలో 8మంది, పశ్చిమగోదావరిలో 8మంది, తూర్పుగోదావరిలో 6గురు, కర్నూలులో ఆరుగురు, విశాఖపట్నంలో ఆరుగురు, అనంతపూర్ లో ఐదుగురు, కృష్ణలో ఐదుగురు, శ్రీకాకుళంలో ఐదుగురు మరణించారు.



గుంటూరులో నలుగురు, విజయనగరంలో ఒక్కరు మరణించారు. గడిచిన 24 గంటల్లో 8,463 మంద కోవిడ్ నుంచి పూర్తిగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జి అయ్యారు. ఇప్పటివరకూ ఏపీలో 35,41,321 శాంపిల్స్ పరీక్షించారు.

ట్రెండింగ్ వార్తలు