Covid Cases in Konaseema : ఏపీలో సీమ ప్రాంత ప్రజలకు అలర్ట్

ఏపీలో కరోనా కేసుల సంఖ్య క్రమేపి పెరుగుతోంది. కొన్ని ప్రాంతాల్లో కేసుల సంఖ్య ప్రమాదకర స్ధాయికి చేరుకుంటున్నాయి. పచ్చని ప్రకృతితో కళకళలాడే కోనసీమలో మళ్లీ పాజిటివ్ కేసులు కలకలం రేపుతున్నాయి.

Konaseema High Alert

Covid Cases in Konaseema : ఏపీలో కరోనా కేసుల సంఖ్య క్రమేపి పెరుగుతోంది. కొన్ని ప్రాంతాల్లో కేసుల సంఖ్య ప్రమాదకర స్ధాయికి చేరుకుంటున్నాయి. పచ్చని ప్రకృతితో కళకళలాడే కోనసీమలో మళ్లీ పాజిటివ్ కేసులు కలకలం రేపుతున్నాయి. కరోనా తీవ్రత పెరగకుండా ప్రజలకు పోలీసులు అవగాహన కల్పిస్తున్నారు. తాజాగా ఏపీలో గడిచిన 24 గంటల్లో 2,527 కరోనా పాజిటివ్ కేసులు రాగా అందులో తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా 515 కేసులు నమోదయ్యాయి.

కోనసీమలో కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా పి.గన్నవరం మండలంలో పలుచోట్ల కంటైన్మెంట్ జోన్లు ఏర్పాటు చేశారు. పాజిటివ్ రేట్ అధికంగా ఉన్న ప్రాంతాల్లో వారం రోజుల పాటు పాక్షిక కర్ఫ్యూ అమలు చేయాలని అధికారులు నిర్ణయించారు. ఈ రోజు నుంచి వారం రోజుల పాటు ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకే సడలింపు ఉంటుంది. మిగతా సమయాల్లో కర్ఫ్యూ కొనసాగనుంది.