Ganesh Idol Immersion : గణేష్ విగ్రహం నిమజ్జనం చేస్తుండగా తెగిన క్రేన్ రోప్.. చెరువులో పడిన విగ్రహంతోపాటు నలుగురు యువకులు
వినాయకుడిని నిమజ్జనం చేస్తున్న నలుగురు యువకులు విగ్రహంతోపాటు చెరువులో పడిపోయారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు గజ ఈతగాళ్లతో గాలింపు చేపట్టి యువకులను రక్షించారు.
- bheemraj
- Published On : September 24, 2023 / 01:34 PM IST
Accident in Ganesh Ghat
Ganesh Idol Immersion Accident : నెల్లూరులోని గణేష్ ఘాట్ లో ప్రమాదం జరిగింది. వినాయక విగ్రహాలను నిమజ్జనం చేస్తుండగా ఒక్కసారిగా క్రేన్ రోప్ తెగి పోయింది. వినాయకుడిని నిమజ్జనం చేస్తున్న నలుగురు యువకులు విగ్రహంతోపాటు చెరువులో పడిపోయారు.
వెంటనే అప్రమత్తమైన పోలీసులు గజ ఈతగాళ్లతో గాలింపు చేపట్టి యువకులను రక్షించారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అయితే చెరువులో పడిన నలుగురు యువకులకు ప్రాణ అపాయం తప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
