Hyderabad Metro : గణేష్ నవరాత్రుల వేళ అర్ధరాత్రి ఒంటి గంట వరకు మెట్రో సేవలు.. హైదరాబాద్ మెట్రో రైలు కీలక నిర్ణయం

ఈ నేపథ్యంలో ఖైరతాబాద్ స్టేషన్ లో అదనపు టికెట్ కౌంటర్లను ఓపెన్ చేస్తామని పేర్కొన్నారు. భక్తులు వీలైనంత త్వరగా టికెట్ పొందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Hyderabad Metro : గణేష్ నవరాత్రుల వేళ అర్ధరాత్రి ఒంటి గంట వరకు మెట్రో సేవలు.. హైదరాబాద్ మెట్రో రైలు కీలక నిర్ణయం

Hyderabad Metro Train (1)

Hyderabad Metro – Ganesh Navratri : గణేష్ నవరాత్రులకు హైదరాబాద్ మహా నగరం సిద్ధమవుతోంది. ఖైరతాబాద్ గణేషుడిని దర్శించుకునేందుకు భారీగా భక్తులు తరలివస్తారు. నగరం నలుమూలల నుంచే కాకుండా పొరుగు రాష్ట్రాలపై కర్ణాటక, మహారాష్ట్ర నుంచి కూడా తరలివస్తుంటారు. ఈ నేపథ్యంలో భక్తులను దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్ మెట్రో కీలక నిర్ణయం తీసుకుంది.

గణేష్ నవరాత్రుల సందర్భంగా అర్ధరాత్రి ఒంటి గంట వరకు మెట్రో రైళ్లను నడిపేందుకు యోచిస్తున్నట్లు మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి పేర్కొన్నారు. గతంలో లాగా ఈ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. ఖైరతాబాద్ గణేష్ ను దర్శించుకునే భక్తులను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.

Ganesh Chaturthi: వినాయక చవితి, నిమజ్జనంపై క్లారిటీ వచ్చేసింది.. గణేశుడి పండగ ఎప్పుడంటే?

ఈ నేపథ్యంలో ఖైరతాబాద్ స్టేషన్ లో అదనపు టికెట్ కౌంటర్లను ఓపెన్ చేస్తామని పేర్కొన్నారు. భక్తులు వీలైనంత త్వరగా టికెట్ పొందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఖైరతాబాద్ మెట్రో స్టేషన్ దగ్గర అదనపు భద్రతను ఏర్పాటు చేస్తామని చెప్పారు.