తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారి దర్శనానికి భక్తుల రద్దీ కొనసాగుతుంది. శ్రీనివాసుడి సాధారణ సర్వదర్శనానికి భక్తులు 10 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి వైకుంఠ క్యూకాంప్లెక్స్ లు అన్ని నిండి భక్తులు బయట నిలిచి ఉన్నారు.
శ్రీవారి సాధారణ సర్వదర్శనానికి 12 గంటల సమయం, టైమ్‌స్లాట్ టోకెన్లు పొందిన భక్తులకు 3 గంటల సమయం పడుతుంది. స్వామివారిని మంగళవారం (అక్టోబర్ 15, 2019) 86 వేల 715 మంది భక్తులు దర్శించుకున్నారు. 29,001 భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం మంగళవారం రూ.3.86 కోట్లుగా ఉంది.
శనివారం శ్రీవారిని లక్షా 13 వందల 71 భక్తులు మంది భక్తులు దర్శించుకున్నారు. 51 వేల 171 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.13 కోట్లు వచ్చిందని టీటీడీ అధికారులు వెల్లడించారు.