Curfew in AP : ఏపీలో కర్ఫ్యూ, అత్యవసరం కోసం ఈ పాస్ విధానం – డీజీపీ

పగటి కర్ఫ్యూ అమలు చేస్తోంది. ఈ క్రమంలో కర్ఫ్యూ నిబంధనలు ఉల్లంఘిస్తే..మాత్రం కఠిన చర్యలు తప్పవని, వాహనాలు జప్తు చేస్తామని డీజీపీ సవాంగ్ హెచ్చరించారు.

AP DGP : ఏపీలో కరోనా నేపథ్యంలో ప్రభుత్వం కఠిన నిబంధనలు అమలు చేస్తోంది. ఇప్పటికే పగటి కర్ఫ్యూ అమలు చేస్తోంది. ఈ క్రమంలో కర్ఫ్యూ నిబంధనలు ఉల్లంఘిస్తే..మాత్రం కఠిన చర్యలు తప్పవని, వాహనాలు జప్తు చేస్తామని డీజీపీ సవాంగ్ హెచ్చరించారు. ప్రభుత్వం నిర్ణయం తీసుకొనే వరకు షరతులు కొనసాగుతాయని, అంతర్ రాష్ట్ర రాకపోకలపై ప్రభుత్వమే నిర్ణయం తీసుకుంటుందని స్పష్టం చేశారు.

ఇక కర్ఫ్యూ కొనసాగుతున్న క్రమంలో…అత్యవసర ప్రయాణీకుల కోసం ఈ పాస్ విధానం అమలు చేయనున్నట్లు, ఇది 2021, మే 10వ తేదీ సోమవారం నుంచి అమలవుతుందని తెలిపారు. పోలీస్‌ సేవ అప్లికేషన్‌ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని, తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకూ రాష్ట్రంలో 144 సెక్షన్‌ అమల్లో ఉంటుందన్నారు.

కరోనా నిబంధనలు ప్రతొక్కరూ పాటించాలని, అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఉల్లంఘనలపై డయల్ 100, 112 నంబర్లకు సమాచారం అందించాలని డీజీపీ సవాంగ్ తెలిపారు. అంతేగాకుండా..శుభకార్యాలకు అధికారుల వద్ద తప్పనిసరిగా అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని, రాజకీయ పార్టీ, సభలు, సమావేశాలకు అనుమతి లేదన్నారు.

ఏపీ రాష్ట్రంలో కరోనా తగ్గుముఖం పట్టడం లేదు. వేల సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో..పగటి కర్ఫ్యూ అమలు చేస్తోంది. రోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు ఆంక్షలు కొనసాగుతున్నాయి. మధ్యాహ్నం 12 గంట వరకు మాత్రమే వ్యాపారం, దుకాణాలు, రెస్టారెంట్లు ఇతర వాటికి మాత్రమే అనుమతినిస్తున్నారు. 2021, మే 18వ తేదీ వరకు ఈ కర్ఫ్యూ అమల్లో కొనసాగనుంది.

Read More : Fungi in Mars Photos: మార్స్ మీద ఫంగస్ గుర్తింపు.. పరిశోధకులు ఏమంటున్నారంటే?

ట్రెండింగ్ వార్తలు