cyber criminals
Cyber Criminals Cheating : సైబర్ నేరగాళ్లు ఘరానా మోసానికి పాల్పడ్డారు. ఓ రిటైర్డ్ ప్రిన్సిపాల్ అకౌంట్ నుంచి భారీగా డబ్బు కొట్టేశారు. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో రిటైర్డ్ మహిళా ప్రిన్సిపాల్ సైబర్ నేరగాళ్లకు చిక్కి రూ.7.25 లక్షలు పోగొట్టుకున్నారు. పాన్ నెంబర్ అప్ డేట్ కాలేదంటూ సైబర్ నేరగాళ్లు రిటైర్డ్ మహిళా ప్రిన్సిపాల్ కు లింక్ పంపారు.
Cyber Criminals : లోన్ ఇప్పిస్తామని రూ.40,000 కాజేసిన సైబర్ నేరగాళ్లు
స్పందించిన ఆమె లింక్ క్లిక్ చేయడంతో అకౌంట్ నుంచి మూడు విడతల్లో రూ. 7.25 లక్షలు మాయమయ్యాయి. అకౌంట్ నుంచి డబ్బులు డ్రా అయినట్లు మెసేజ్ వచ్చింది. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.