Durgagudi EO Bhramaramba : దుర్గగుడి ఈఓగా భ్రమరాంబ

విజయవాడ దుర్గగుడి ఈఓగా భ్రమరాంబ బాధ్యతలు స్వీకరించారు. తొలుత అమ్మవారిని దర్శించుకున్న ఆమె.. దుర్గమ్మ ఆలయానికి ఈవోగా రావడం అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు.

Bhramaramba appointed as the EO of Durgagudi : విజయవాడ దుర్గగుడి ఈఓగా భ్రమరాంబ బాధ్యతలు స్వీకరించారు. తొలుత అమ్మవారిని దర్శించుకున్న ఆమె.. దుర్గమ్మ ఆలయానికి ఈవోగా రావడం అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు. అమ్మ దయతోనే పదవి దక్కిందన్నారు. ఇంద్రకీలాద్రిపై వివాదాలకు చెక్‌ పెట్టేవిధంగా పనిచేస్తానని ఈఓ భ్రమరాంబ పేర్కొన్నారు.

దుర్గగుడి ఈవో సురేశ్ బాబుపై నిన్న బదిలీ వేటు పడింది. ఆయన్ను రాజమండ్రి ఆర్జేసీగా దేవాదాయశాఖకు బాబు బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దుర్గగుడిలో ఏసీబీ, విజిలెన్స్ రైడ్స్ నేపథ్యంలో సురేశ్ బాబును బదిలీ చేసినట్లుగా తెలుస్తోంది. దుర్గగుడి నూతన ఈవోగా డి.భ్రమరాంబను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది.

2019లో దుర్గగుడి ఈవోగా సురేశ్ బాబు బాధ్యతలు తీసుకున్నారు. అయితే ఆయన నియామకం నుంచే ఇంద్రకీలాద్రిపై అనేక వివాదాలు నెలకొన్నాయి. ఆయన క్యాడర్ కు సంబంధించి ఈవో పోస్టుకు అర్హడు కాదంటూ కొంతమంది కోర్టులో పిటిషన్ వేశారు. తర్వాత ఆర్జేసీగా ప్రమోషన్ రావడం, ఇతరత్రా జరిగిన పరిణామాల నేపథ్యంలో దాదాపు 17 నెలల కాల వ్యవధిలో అనేక అవినీతి, అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి.

ఈ నేపథ్యంలో ఏసీబీ అధికారులు మూడు రోజులపాటు ఇంద్రకీలాద్రిపై తనిఖీలు చేసిన తర్వాత ప్రాథమికంగా రిపోర్టు ఇచ్చారు. ప్రాథమికంగా రిపోర్టు ఆధారంగా ఇంద్రకీలాద్రిపై దాదాపు 15 మంది ఉద్యోగులపై వేటు పడింది. తర్వాత విజిలెన్స్ అధికారులు కూడా తనిఖీలు నిర్వహించారు.

ఈ తనిఖీలకు సంబంధించి ప్రాథమిక రిపోర్టు ఇచ్చారు. దేవాదాయ కమిషన్ కు ఎటువంటి సంబంధం లేకుండా కాంట్రాక్టర్ కు డబ్బులు చెల్లించినట్లుగా అభియోగాలు ఉన్నాయి. దీనికి సంబంధించి ప్రాథమిక రిపోర్టు ఇప్పటికే ఇచ్చారు.

ట్రెండింగ్ వార్తలు