Daggubati Purandeswari : అల్లు అర్జున్ ఒక్క‌డినే అరెస్ట్ చేయ‌డం స‌రైంది కాదు.. పురందేశ్వ‌రి కామెంట్స్‌..

సంధ్య థియేట‌ర్‌లో జ‌రిగిన తొక్కిస‌లాట ఘ‌ట‌న పై బీజేపీ ఎంపీ, రాష్ట్ర అధ్య‌క్షురాలు పురందేశ్వరి స్పందించారు

Daggubati Purandeswari comments on Sandhya Theater incident

సంధ్య థియేట‌ర్‌లో జ‌రిగిన తొక్కిస‌లాట ఘ‌ట‌న పై బీజేపీ ఎంపీ, రాష్ట్ర అధ్య‌క్షురాలు పురందేశ్వరి స్పందించారు. పుష్ప‌ 2మూవీ తొక్కిసలాట ఘటన సినీ హీరో అల్లు అర్జున్ ప్రేరేపించింది కాద‌న్నారు. కేవలం ఒక సినీ నటుడిగా మాత్రమే ఆయ‌న థియేటర్ వద్దకు వెళ్లార‌న్నారు. మిగతావారిని అరెస్ట్ చేయకుండా అల్లుఅర్జున్‌ను ఒక్కడిని మాత్రమే అరెస్ట్ చేయడం అనేది క‌రెక్ట్ కాద‌న్నారు.

ఇక జ‌మిలీ ఎన్నిక‌ల‌పై మాట్లాడుతూ.. జ‌మిలీ ఎన్నికలకు సంభందించి లోక్ సభలో ప్రవేశ పెట్టిన బిల్లును జాయింట్ పార్లమెంటరీ కమిటీ ముందు ప్రవేశ పెట్టడం జరిగిందన్నారు. జ‌మిలీ ఎన్నికలనేవి ఒక పార్టీ ప్రవేశ పెట్టి అమలు చేసేవి కాదన్నారు. దానిపై అన్ని పార్టీల, ప్రజల అభిప్రాయాలు తీసుకుంటార‌న్నారు. చ‌ర్చ‌ల అనంత‌ర‌మే మంచి చెడు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుందన్నారు.

Game Changer : గేమ్ ఛేంజ‌ర్ నుంచి ‘దోప్’ సాంగ్ వ‌చ్చేసింది.. జానీ మాస్ట‌ర్ కంపోజింగ్‌లో రామ్‌చ‌ర‌ణ్‌, కియారా స్టెప్పులు..

ఆ త‌రువాత‌నే ఉభయసభల్లో ఆబిల్లును ప్రవేశ పెట్టి చ‌ర్చించిన త‌రువాత ఓటింగ్ జరుగుతుందన్నారు. అంతే తప్ప ఇప్ప‌టికిప్పుడు ఏదో జ‌రిగిపోతుంద‌ని గందరగోళం సృష్టించ‌డం స‌రైంది కాద‌న్నారు. ఓటింగ్ జరిగిన తర్వాత బిల్లు ఆమోదం పొందిన అనంతరమే జ‌మిలీ ఎన్నిక‌లు వ‌చ్చే అవ‌కాశం ఉంద‌న్నారు. ఎవ‌రు అయినా సరే వారి అబిప్రాయాలను వారూ జేపీసికి చెప్పొచ్చన్నారు. జ‌మిలీ ఎన్నికల పై వైసీపీ నాయకులు చేసిన వ్యాఖ్య‌ల‌పై తాను స్పందించాల్సిన అవ‌స‌రం లేద‌న్నారు.