Daggubati Purandeswari : కేంద్ర పథకాలకు రాష్ట్ర పథకాలుగా స్టిక్కర్లు వేసుకుని ప్రచారం.. సీఎం జగన్ పై పురంధరేశ్వరి ఫైర్

కేంద్రం ఆయుష్మాన్ భారత్ ద్వారా పేదలకు ఐదు లక్షల రూపాయల వైద్య సాయం అందిస్తుందని పేర్కొన్నారు. ఇటువంటి వాటిపై ప్రజలు అవగాహన పెంచుకోవాలన్నారు.

Daggubati Purandeswari (1)

Daggubati Purandeswari – Vijayawada : కేంద్ర పథకాలకు రాష్ట్ర పథకాలుగా స్టిక్కర్లు వేసుకుని ప్రచారం చేస్తున్నారని బీజేపీ ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధరేశ్వరి తెలిపారు. ఆరోగ్య శ్రీకి సీఎం నిధులు ఇవ్వకపోవడం వల్ల ఆస్పత్రిలో సేవలు నిలిపి వేస్తున్నారని తెలిపారు. విజయవాడలో వికసిత్ భారత్ సంకల్ప్ యాత్ర రథాన్ని దగ్గుబాటి పురంధరేశ్వరి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు.

కేంద్రం ఆయుష్మాన్ భారత్ ద్వారా పేదలకు ఐదు లక్షల రూపాయల వైద్య సాయం అందిస్తుందని పేర్కొన్నారు. ఇటువంటి వాటిపై ప్రజలు అవగాహన పెంచుకోవాలన్నారు. వికసిత్ భారత్ కార్యక్రమం దేశ వ్యాప్తంగా చేస్తున్నామని కేంద్రం అమలు చేసే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రచారం చేస్తామని చెప్పారు.

Boycot Polling : డబ్బులు ఇవ్వలేదు ఓటు వేయం.. పలు చోట్ల పోలింగ్ బహిష్కరించిన గ్రామస్తులు

వికసిత్ భారత్ పేరుతో ఏపీలో 50 వ్యాన్ లతో యాత్ర సాగుతుందన్నారు. ప్రజల కోసం కేంద్రం అమలు చేస్తున్న పథకాలు, సంక్షేమం గురించి ప్రజలు తెలుసుకోవాలన్నారు. ఇళ్లు రాని వారు ఆ వ్యాన్ దగ్గరకు వెళ్లి అవసరమైన సమాచారం తెలుసుకోవచ్చన్నారు.

ఆరోగ్య శ్రీకి సీఎం నిధులు ఇవ్వకపోవడం వల్ల ఆస్పత్రిలో సేవలు నిలిపి వేస్తున్నారని తెలిపారు. కేంద్రం ఆయుష్మాన్ భారత్ ద్వారా పేదలకు ఐదు లక్షల రూపాయల వైద్య సాయం అందిస్తుందని పేర్కొన్నారు. ఇటువంటి వాటిపై ప్రజలు అవగాహన పెంచుకోవాలన్నారు.

Traffic Jam : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్.. హైదరాబాద్ – విజయవాడ హైవేపై ట్రాఫిక్ జామ్

రాష్ట్రంలోని 400మండలాల్లో కరవు విలయ తాండవం చేస్తుందన్నారు. కరవు విషయంలో క్యాబినెట్ లో కూడా చర్చించ లేదని తెలిపారు. ఏపీలో‌ వ్యవసాయ శాఖ మంత్రి ఎవరు అంటే వెతుక్కుంటున్నారని విమర్శించారు. నీటిపారుదల శాఖ మంత్రి ఎవరంటే మాత్రం చెబుతున్నారని పేర్కొన్నారు. రైతులను ఆడుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంతో వ్యవహరిస్తుందని విమర్శించారు.

నాగార్జున సాగర్ వద్దకు పోలీసులను పంపడం చాలా ఘోరం అన్నారు. నాలుగున్నరేళ్లుగా పట్టించుకోకుండా ఇప్పుడు ఎందుకు హడావుడి చేస్తున్నారని ప్రశ్నించారు. ఎన్నికల నేపథ్యంలో ఓట్ల కోసమే ఈ వివాదం చేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వం చర్యలను బీజేపీ ఖండిస్తుందన్నారు.

 

 

 

 

ట్రెండింగ్ వార్తలు