Boycot Polling : డబ్బులు ఇవ్వలేదు ఓటు వేయం.. పలు చోట్ల పోలింగ్ బహిష్కరించిన గ్రామస్తులు

ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలంలోని సత్యంపేట గ్రామస్థులు పోలింగ్ ను బహిష్కరించారు. అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టని కారణంగా ఓటేయమని స్పష్టం చేశారు.

Boycot Polling : డబ్బులు ఇవ్వలేదు ఓటు వేయం.. పలు చోట్ల పోలింగ్ బహిష్కరించిన గ్రామస్తులు

people boycotted polling

People Boycot Polling : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. చాలా మంది ఓటు వేసేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. భారీగా జనం తరలివచ్చి ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. అయితే రాష్ట్రంలోని పలు చోట్ల గ్రామస్తులు పోలింగ్ ను బహష్కరించారు. ఓటు వేసేందుకు నిరాకరించారు. వరంగల్, ఖమ్మం, మహబూబ్ నగర్ జిల్లాల్లో ఓటర్లు పోలింగ్ ను బహిష్కరించారు.

ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలంలోని సత్యంపేట గ్రామస్థులు పోలింగ్ ను బహిష్కరించారు. అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టని కారణంగా ఓటేయమని స్పష్టం చేశారు. కాగా, ఓటేయాలని అధికారులు బతిమాలడంతో వెనక్కి తగ్గి ఓటేసేందుకు ముందుకు వచ్చారు.

Traffic Jam : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్.. హైదరాబాద్ – విజయవాడ హైవేపై ట్రాఫిక్ జామ్

వరంగల్ జిల్లా వెంకటాపురం మండలం ఉప్పేడు వీరాపురం, గొల్లగూడెం గ్రామస్తులు ఓటేయమని మొండికేశారు. ఆయా పార్టీల నేతలు తమకు డబ్బులు ఇవ్వలేదని, తాము ఓటు వెయ్యబోమని గ్రామంలోని పలువురు అసంతృప్తి వ్యక్తం చేశారు. డబ్బులిస్తేనే ఓటేస్తామని తెగేసి చెబుతున్నారు.
ఓటేసే దిక్కులేదు

అసిఫాబాద్ జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గంలోని వరిపేట గ్రామస్తులు ఓటేసేందుకు నిరాకరించారు. తమ గ్రామాన్ని పంచాయతీగా ఏర్పాటు చేయకపోవడాన్ని నిరసిస్తూ పోలింగ్ ను బహిష్కరించారు. గ్రామంలో పోలింగ్ కు దూరంగా ఉండిపోయారు. దీంతో ఉదయం 10 గంటల వరకు కేవలం 12 ఓట్లు మాత్రమే పడటం గమనార్హం.