YS Jagan: ప్రధాని మోదీకి వైఎస్ జగన్ లేఖ.. అన్యాయం జరగకుండా చూడాలని విజ్ఞప్తి

మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు.

YS Jagan letter to pm modi

YS Jagan: మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. డీలిమిటేషన్ అంశంపై దక్షిణాది రాష్ట్రాల్లో ఆందోళన నెలకొన్న వేళ.. వచ్చేఏడాది జరగబోయే డీలిమిటేషన్ ప్రక్రియలో ఆయా రాష్ట్రాల సీట్ల విషయంలో అన్యాయం జరగకుండా చూడాలని ప్రధాని మోదీని లేఖలో జగన్ మోహన్ రెడ్డి కోరారు.

Also Read: Nagababu: నాగబాబును ఏడాదిన్న తర్వాతే క్యాబినెట్‌లోకి తీసుకుంటారా? ఎందుకంటే?

1971 నుంచి 2011 మధ్య 40 సంవత్సరాల కాలంలో దేశ జనాభాలో దక్షిణాది రాష్ట్రాల వాటా తగ్గింది. గత 15 సంవత్సరాల కాలంలో ఈ వాటా మరింత తగ్గింది. దీనికి కారణం. కేంద్రం ఇచ్చిన జనాభా నియంత్రణ పిలుపే. కేంద్రం ఇచ్చిన జనాభా నియంత్రణ పిలుపును దక్షిణాది రాష్ట్రాలు చిత్తశుద్ధితో అమలు చేయడం కారణంగా జనాభా తగ్గింది. ఈ దశలో జనాభా ఆధారంగా డీలిమిటేషన్ ప్రక్రియ చేపడితే తమ రాష్ట్రాల్లో నియోజకవర్గాలు తగ్గుతాయనే చర్చ దక్షిణాది రాష్ట్రాల్లో జరుగుతుంది.

Also Read: YSRCP: జగన్‌కు సన్నిహితంగా ఉండే లీడర్లు వైసీపీని ఎందుకు వీడుతున్నట్లు? ఇందుకేనా?

ప్రస్తుతం ఉన్న జనాభా లెక్కల ప్రకారం నియోజకవర్గాల పున:ర్విభజన ప్రక్రియ చేపడితే దక్షిణాది రాష్ట్రాల భాగస్వామ్యం కచ్చితంగా తగ్గుతుంది. అందుకే జనాభా లెక్కల ప్రకారం ఈ డీలిమిటేషన్ లేకుండా చూడాలి. పార్లమెంటులో తీసుకునే విధాన నిర్ణయాలలో రాష్ట్రాలకు సమాన భాగస్వామ్యం కల్పించేలా ఉండాలి. అప్పుడే జాతీయ విధాన రూపకల్పనలో అన్ని రాష్ట్రాలకు సరియైన భాగస్వామ్యం ఉంటుంది. అందుకే దక్షిణాన సీట్ల తగ్గింపు లేకుండా చూడాలి. ఈ కోణంలో ఆలోచించి డీలిమిటేషన్ చేపట్టాలని కోరుకుంటానని ప్రధాని మోదీకి రాసిన లేఖలో జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు.

లోక్‌సభ, రాజ్యసభలో ఏ రాష్ట్రానికి ప్రాతినిధ్యం తగ్గకుండా ఉండే విధంగా నియోజకవర్గాల పున:ర్విభజన కసరత్తును నిర్వహించాలని కేంద్రాన్ని కోరుకుంటున్నానని వైఎస్‌ జగన్‌ లేఖలో కోరారు.