Srisailam Reservoir : సందర్శకులకు నో ఎంట్రీ

రెండు తెలుగు రాష్ట్రాల మధ్య జల జగడం రోజు రోజుకు ముదురుతోంది. రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్ట్ విషయంలో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదం మొదలైంది. అది రోజు రోజుకు తీవ్రమవుతుంది. రాయలసీమ ఎత్తిపోతల పథకం ద్వారా శ్రీశైలం ప్రాజెక్ట్ నుంచి నీటిని తరలిస్తే నాగార్జున సాగర్ ఆయకట్టు రైతులు తీవ్రంగా నష్టపోతారని తెలంగాణ ఆరోపిస్తుంది.

Srisailam

Srisailam Reservoir : రెండు తెలుగు రాష్ట్రాల మధ్య జల జగడం రోజు రోజుకు ముదురుతోంది. రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్ట్ విషయంలో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదం మొదలైంది. అది రోజు రోజుకు తీవ్రమవుతుంది. రాయలసీమ ఎత్తిపోతల పథకం ద్వారా శ్రీశైలం ప్రాజెక్ట్ నుంచి నీటిని తరలిస్తే నాగార్జున సాగర్ ఆయకట్టు రైతులు తీవ్రంగా నష్టపోతారని తెలంగాణ ఆరోపిస్తుంది.

ఈ నేపథ్యంలోనే ప్రాజెక్టు పనులను నిలపాలని కృష్ణా బోర్డుకు లేఖ రాసింది. ఇక మరోవైపు విద్యుత్ ఉత్పత్తి నిలిపివేయాలంటూ కృష్ణా బోర్డుకు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం లేఖ రాసింది. ఇక ఇదే విషయమై ఆంధ్ర, తెలంగాణ నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే డ్యామ్ వద్ద భద్రత కట్టుదిట్టం చేశారు.

శనివారం నుంచి శ్రీశైలం జలాశయంపైకి సందర్శకుల అనుమతి నిరాకరించారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. ఉద్రికత్త పరిస్థితుల నేపథ్యంలో సందర్శకుల అనుమతి నిరాకరించినట్లు అధికారులు పేర్కొన్నారు. తిరిగి ఎప్పుడు అనుమతిస్తారు అనే దానిపై స్పష్టత ఇవ్వలేదు.