నిధులు ఎందుకు మళ్లించారు? తొలి రివ్యూలోనే అధికారులకు చెమట్లు పట్టించిన మంత్రి పవన్ కల్యాణ్

కేంద్రం నుంచి వచ్చిన నిధులు ఎంత? సీ.ఎఫ్.ఎం.యస్ కు ఎంత మళ్లించారు? ఎందుకు మళ్లించారు? ఈ వివరాలు తనకు వెంటనే ఇవ్వాలని ఆదేశించారు.

Deputy Cm Pawan Kalyan : డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అప్పుడే పని మొదలు పెట్టారు. తనకు అప్పగించిన శాఖలపై ఫోకస్ పెట్టారు. తొలి రివ్యూ మీటింగ్ లోనే ఆయన అధికారులకు చెమట్లు పట్టించారు. నా దగ్గర డ్రామాలొద్దు అన్న రీతిలో విరుచుకుపడ్డారు. కేంద్రం నుంచి వచ్చే నిధులను ఇతరాలకు మళ్లించడంపై మంత్రి పవన్ కల్యాణ్ ఓ రేంజ్ లో సీరియస్ అయ్యారు.

కేంద్రం నుంచి వచ్చే నిధులను మళ్లించడంపై అధికారులను నిలదీశారాయన. 15వ ఆర్థిక సంఘం నిధుల మళ్లింపుపై అధికారులపై ప్రశ్నల వర్షం కురిపించారు. స్థానిక సంస్థలకు నిధులు ఎందుకు ఇవ్వలేదని అసహనం వ్యక్తం చేశారు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్.

కేంద్రం నుంచి వచ్చే నిధులు, ఆర్ధిక సంఘం నిధులు సీఎఫ్.ఎం.యస్ కు ఎందుకు మళ్లించారని అధికారులను ప్రశ్నించారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. పంచాయతీలు, స్థానిక సంస్థలకు వెళ్లాల్సిన నిధుల మళ్లింపుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. నిధులు ఏమేరకు మళ్లించారో తనకు వెంటనే నివేదిక ఇవ్వాలని ఆదేశించారు పవన్ కల్యాణ్. కేంద్రం ఇచ్చే నిధుల మళ్లింపు సీరియస్ అంశమని మంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. CFMS ఖాతాకు ఎన్ని ఆర్థిక సంఘం, స్థానిక సంస్థల నిధులను మళ్లించారో నివేదిక సమర్పించాలని ఆదేశించారు. మరోవైపు సీజనల్ వ్యాధుల కట్టడికి కార్యాచరణ రూపొందించాలని ఆదేశించారు మంత్రి పవన్ కల్యాణ్.

పంచాయతీరాజ్, పురపాలకశాఖ, వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో పవన్ సమీక్ష నిర్వహించారు. మంత్రులు నారాయణ, సత్యకుమార్ యాదవ్, చీఫ్ సెక్రటరీ నీరబ్ కుమార్ ప్రసాద్ హాజరయ్యారు. ఆయా శాఖల ప్రిన్సిపల్ సెక్రటరీలను నిధుల మళ్లింపుపై నిలదీశారు పవన్ కల్యాణ్. కేంద్రం నుంచి వచ్చిన నిధులు ఎంత? సీ.ఎఫ్.ఎం.యస్ కు ఎంత మళ్లించారు? ఎందుకు మళ్లించారు? ఈ వివరాలు తనకు వెంటనే ఇవ్వాలని ఆదేశించారు.

గ్రామాలు, పట్టణాల్లో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు మంత్రి పవన్ కల్యాణ్. గుంటూరు, విజయవాడలో డయేరియా వచ్చి మనుషులు చనిపోవడంపై ఆయన ఆరా తీశారు. నిధులు లేవని అధికారులు చెప్పడంతో కేంద్రం నుంచి వచ్చిన నిధులు ఎందుకు మళ్లించారని నిలదీశారు. ఎవరి ఆదేశాలతో నిధులు మళ్లించారో కూడా తనకు నివేదిక ఇవ్వాలని చీఫ్ సెక్రటరీని ఆదేశించారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్.

Also Read : చంద్రబాబు నాయుడు, వైఎస్ జగన్ ఎందుకు స్పందించరు: వైఎస్ షర్మిల

 

ట్రెండింగ్ వార్తలు