Raghurami Reddy : డబ్బు కోసం రాజకీయాలు చేసే వ్యక్తి డీఎల్ రవీంద్రారెడ్డి : ఎమ్మెల్యే రఘురామి రెడ్డి

అన్ని పదవులు అనుభవించావు గౌరవంగా బ్రతకడం నేర్చుకోవాలని హితవు పలికారు. ప్రజలకు సేవ చేసింది, దాన ధర్మాలు చేసింది ఎవరు అనేది అందరికీ తెలుసన్నారు.

MLA Raghurami Reddy (1)

Raghurami Reddy – DL Ravindra Reddy : మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డిపై ఎమ్మెల్యే రఘురామి రెడ్డి మండిపడ్డారు. తాను కారులో తిరిగే సమయంలో డిఎల్ రవీంద్రారెడ్డికి సైకిల్ లేదన్నారు. డబ్బు కోసం రాజకీయాలు చేసే వ్యక్తి రవీంద్రారెడ్డి అని ఆరోపించారు. 2011లోనే డిఎల్ రవీంద్ర రెడ్డి చాప్టర్ క్లోజ్ అయిందన్నారు. ఈ మేరకు ఆయన కడప జిల్లాలో మీడియాతో మాట్లాడారు.

రాజకీయాల కోసం 70 కోట్ల రూపాయల భవనాన్ని అమ్మానని తెలిపారు. రెండు కోట్ల రూపాయల ఫ్లాట్ కొన్నానని పేర్కొన్నారు. ‘నువ్వు రాజకీయాల్లోకి వచ్చే నాటికి నీ ఆస్తి ఎంత నేడు నీ ఆస్తి ఎంత’ అని ప్రశ్నించారు. అన్ని పదవులు అనుభవించావు గౌరవంగా బ్రతకడం నేర్చుకోవాలని హితవు పలికారు.

Pawan Kalyan : పెడనలో నాపై రాళ్లదాడి చేస్తారని సమాచారం, నాకేం జరిగినా వాళ్లదే బాధ్యత : పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు

ప్రజలకు సేవ చేసింది, దాన ధర్మాలు చేసింది ఎవరు అనేది అందరికీ తెలుసన్నారు. తెల్లారితే ఎన్నికలు, తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేసుకోమని చెప్పావని తెలిపారు. తమ కుటుంబం మరలా వచ్చే అనేక ఎన్నికల్లో ఉంటుందని వెల్లడించారు.