Varla Ramaiah : ఆ పనిచేయండి ముఖ్యమంత్రిగారు.. ఎవరి సలహా వినకండి.. జగన్‌కు వర్ల రామయ్య సూచన..

ఏపీలో కేబినెట్ విస్తరణపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మంత్రివర్గంలో ఎవరికి చోటు లభిస్తుందోనన్న చర్చ నడుస్తోంది. అయితే ఇప్పటికే సీఎం జగన్మోహన్ రెడ్డి కొత్త మంత్రుల జాబితాను ...

Varlla Ramaia

Varla Ramaiah : ఏపీలో కేబినెట్ విస్తరణపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మంత్రివర్గంలో ఎవరికి చోటు లభిస్తుందోనన్న చర్చ నడుస్తోంది. అయితే ఇప్పటికే సీఎం జగన్మోహన్ రెడ్డి కొత్త మంత్రుల జాబితాను సిద్ధం చేశారు. నేడు ఆ జాబితాను గవర్నర్ కు అందించనున్నారు. క్యాబినెట్ విస్తరణలో భాగంగా పాతవారితో పాటు కొత్తవారికి అవకాశం కల్పించనున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే మంత్రులుగా కొనసాగిన వారిలో కొందరిని కొనసాగిస్తూ, మిగిలిన వారిలో కొత్త వారిని తీసుకుంటున్నారు. ఈ క్రమంలో హోంమంత్రి సుచరితకు మరోసారి మంత్రిగా అవకాశం దక్కలేదు. ఈ క్రమంలో టీడీపీ నేత వర్ల రామయ్య ఆసక్తికర ట్వీట్ చేశారు.

ముఖ్యమంత్రి గారూ.. నోరులేని మా దళిత హోం మంత్రి సుచరిత గారిని తొలగించి, కొత్త మంత్రి మండలిలో నోరు తప్ప ఏమీలేని బూతుల మంత్రి కొడాలి నానిని కొనసాగించాలని చూడటం మంచిది కాదేమో, ఆలోచించండి. అన్నమాట మీద నిలబడి అందరినీ పీకేయండి సార్. మాట తప్పకండి, మడమ కూడా తిప్పకండి. ఎవరి సలహాలు వినకండి అని వర్ల రామయ్య ట్వీట్ చేశారు.