Dollar Seshadri: గోవిందదామంలో డాలర్ శేషాద్రి అంతిమ సంస్కారాలు

టీటీడీ ఓఎస్డీ డాలర్ శేషాద్రి అంతిమసంస్కారాలు ఇవాళ(30 నవంబర్ 2021) జరగబోతున్నాయి.

Dollar Seshadri: టీటీడీ ఓఎస్డీ డాలర్ శేషాద్రి అంతిమసంస్కారాలు ఇవాళ(30 నవంబర్ 2021) జరగబోతున్నాయి. సిరిగిరి అపార్ట్‌మెంట్‌లో ప్రజల సందర్శనార్థం శేషాద్రి భౌతిక కాయాన్ని ఉంచారు. మధ్యాహ్నం తిరుపతి గోవిందదామంలో అంత్యక్రియలు నిర్వహించబోతున్నారు. శేషాద్రి అంతమసంస్కారాల్లో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ కూడా పాల్గొంటారు.

ఈరోజు ఉదయం 11గంటలకు ఎన్వీ రమణ రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుని, అక్కడ్నుంచి డాలర్ శేషాద్రి నివాసానికి వెళ్లి ఆయన పార్థివదేహానికి అంతిమ నివాళి అర్పిస్తారు. అనంతరం జరిగే అంతిమ యాత్రలో పాల్గొంటారు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ. విశాఖలో కార్తీక దీపోత్సవం కార్యక్రమంలో పాల్గొనడానికి వైజాగ్ వెళ్లిన డాలర్ శేషాద్రి.. గుండెపోటు రావడంతో మృతి చెందారు.

Lionel Messi: లియోనెల్ మెస్సీకి ఏడోసారి అవార్డు.. ఎవరూ టచ్ చేయని రికార్డు!

డాలర్ శేషాద్రి మృతిపట్ల ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుతోపాటు పలువు ప్రముఖులు దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. డాలర్ శేషాద్రి ధన్యజీవి అని కొనియాడారు టీటీడీ ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి. డాలర్ శేషాద్రి మరణం టీటీటీకి తీరని లోటని, టీటీడీలో శేషాద్రి సేవలు అనిర్వచనీయమైనవి అని తెలిపారు.

Drug laws: డ్రగ్స్ చట్టాల్లో సడలింపులు.. మొదటిసారైతే జైల్లో పెట్టరు

తిరుమల స్వామివారి కైంకర్యాలు.. దేవాలయ సాంప్రదాయాలపై అపార అనుభవం ఉన్న వ్యక్తి. తిరుమల శ్రీవారి దర్శనానికి ప్రముఖులు ఎవరు వచ్చినా.. వారితో డాలర్ శేషాద్రి కనిపించేవారు. తిరుమలలో జరిగే ప్రతి ఉత్సవంలోనూ డాలర్ శేషాద్రి పాల్గొనేవారు. తన తుది శ్వాస వరకూ శ్రీవారి సేవలోనే తరిస్తానని గతంలో చెప్పారు.. చెప్పినట్లుగానే చివరకు అలాగే స్వామివారికి సేవచేసి కన్నుమూశారు.

ట్రెండింగ్ వార్తలు