Jogi Ramesh: మాజీ మంత్రి జోగి రమేష్ ఫ్యామిలీపై గృహ హింస కేసు.. కోడలు మేఘన సంచలన ఫిర్యాదు
విజయవాడ సమీపంలోని ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్‌లో జోగి రమేష్(Jogi Ramesh) కుటుంబ సభ్యులపై గృహ హింస కేసు నమోదవటం స్థానికంగా పెద్ద ఎత్తున కలకలం రేపింది.
- V Santhosh Kumar
- Published on- July 24, 2026 / 10:54 PM IST
Domestic violence case registered on former minister jogi ramesh family
- మాజీ మంత్రికి బిగ్ షాక్
- పదకొండు మందిపై కేసు నమోదు
- పోలీసులను ఆశ్రయించిన కోడలు మేఘన
Jogi Ramesh: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాజీ మంత్రి, వైసీపీ నాయకుడు జోగి రమేష్ కుటుంబానికి సంబంధించిన ఒక అంశం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. విజయవాడ సమీపంలోని ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్‌లో జోగి రమేష్ కుటుంబ సభ్యులపై గృహ హింస కేసు నమోదవటం స్థానికంగా పెద్ద ఎత్తున కలకలం రేపింది. జోగి రమేష్ కుమారుడు జోగి రాజీవ్ భార్య అయిన మేఘన స్వయంగా పోలీసులను ఆశ్రయించి ఈ ఫిర్యాదును అందజేయడం విశేషం.
NTA Action: నీట్ పేపర్ లీకేజీపై కేంద్రం కఠిన చర్యలు.. NTA నుంచి 47 మంది అధికారుల తొలగింపు
మేఘన ఫిర్యాదుతో నమోదు – విచారణలో పోలీసులు!
తనపై కుటుంబ సభ్యులు వేధింపులకు పాల్పడుతున్నారంటూ బాధితురాలు మేఘన పోలీసులకు రాతపూర్వక కంప్లైంట్ ఇచ్చారు. ఆమె ఇచ్చిన ఫిర్యాదు, ప్రాథమిక వివరాల ఆధారంగా స్పందించిన ఇబ్రహీంపట్నం పోలీసులు గృహ హింస చట్టం కింద అధికారికంగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తును ముమ్మరం చేశారు.
మొత్తం 11 మందిపై ఎఫ్‌ఐఆర్ – కేసు నమోదు!
ఈ కేసులో మాజీ మంత్రి జోగి రమేష్(Jogi Ramesh)తో పాటు ఆయన కుటుంబానికి చెందిన మొత్తం 11 మందిపై పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు సమాచారం. గృహ హింసకు సంబంధించి మేఘన ఇచ్చిన కంప్లైంట్‌ను అన్ని కోణాల్లో క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామని, విచారణ అనంతరం తగిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.
