Drone
Anti Drone Technology : భారతదేశంలో ఉగ్రదాడులు పెరిగిపోతున్నాయి. ఎక్కడో ఓ చోట ఉగ్రమూలాలు వెలుగు చూస్తున్నాయి. ప్రధానంగా డ్రోన్లతో దాడులు జరపడం కలకలం రేపుతోంది. ప్రధాన పట్టణాల, ఇతర ముఖ్య ప్రాంతాలను వీరు టార్గెట్ చేస్తున్నారు. ఏపీలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుపతిలో డ్రోన్ జామర్ ను ఏర్పాటు చేసేందుకు రంగం సిద్ధం చస్తున్నారు. డ్రోన్ల దాడులను తిప్పికొట్టేందుకు రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (DRDO) యాంటీ డ్రోన్ టెక్నాలజీని అభివృద్ధి చేసింది.
Read More : Married Woman Missing : ఫోన్ కాల్ తెచ్చిన తిప్పలు…ఈడొచ్చిన ముగ్గురు పిల్లలతో తల్లి ఆదృశ్యం
యాంటీ డ్రోన్ టెక్నాలజీని ఏర్పాటు చేస్తున్న ఘనత టీటీడీకి దక్కుతుంది. శ్రీవారి ఆలయ రక్షణ వ్యవస్థలో దీనిని ఉపయోగించనున్నారు. ఇటీవలే జమ్ములో వైమానిక దళంపై డ్రోన్ల దాడి జరిగిన సంగతి తెలిసిందే. దీంతో యాంటీ డ్రోన్ వ్యవస్థపై డీఆర్డీవో దృష్టి సారించింది. కర్ణాటకలోని కోలార్ వద్ద…జూలై 06వ తేదీన మూడు రకాల టెక్నాలజీని అభివృద్ధి చేసింది. ఈ ప్రదర్శనకు వివిధ పోలీసు శాఖల ప్రతినిధులు, టీటీడీ విజిలెన్స్, సెక్యూర్టీ వింగ్ చీఫ్, ఇతర అధికారులు హాజరయ్యారు. అనంతరం ఈ టెక్నాలజీని కొనుగోలు చేసేందుకు అధికారులు నిర్ణయించారు.
Read More : Rain-Hit Maharashtra: మహారాష్ట్రలో కొండచరియలు విరిగిపడి 36మంది మృతి..రంగలోకి దిగిన హెలికాఫ్టర్లు
ఈ కొనుగోలుకు రూ. 22 కోట్లు ఖర్చవుతుందని అంచనా. డి 4 డ్రోన్ వ్యవస్థగా పిలిచే దీనిని డ్రోన్ దాడుల ముప్పు నుంచి రక్షణ కేంద్రాలను కాపాడుకోవచ్చు. నాలుగు కిలోమీటర్ల పరిధిలో డ్రోన్లను గుర్తించి దాడి చేస్తుంది. డ్రోన్ లో ఉన్న కమాండ్ అండ్ కంట్రోల్ సిస్టమ్ ను జామ్ చేయడమే కాకుండా…దీనికి సంబంధించిన హార్డ్ వేర్ ను నాశనం చేసేస్తుంది. ఇక డి 4 డ్రోన్ వ్యవస్థలో అనేక సెన్సార్లు, ఇందులో రెండు విధ్వంసకర పరికరాలు ఉన్నట్లు డీఆర్డీవో వెల్లడిస్తోంది. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ సిస్టమ్స్ ఈ టెక్నాలజీని అభివృద్ధి చేసింది. సాధ్యమైనంత త్వరలోనే తిరుమల కొండపై ఈ టెక్నాలజీని ఉపయోగించేందుకు అధికారులు కృషి చేస్తున్నారు.