AP Dasara Holidays-2022: ఏపీలో పాఠశాలలకు 26 నుంచి దసరా సెలవులు.. ఎన్నిరోజులంటే..
వచ్చేనెలలో దసరా పండుగ సందర్భంగా ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీలోని పాఠశాలలకు ఈనెల 26 నుంచి దసరా సెలవులు ప్రకటించింది.
- Harishth Thanniru
- Published On : September 13, 2022 / 05:27 PM IST
AP Dasara Holidays-2022
AP Dasara Holidays-2022: వచ్చేనెలలో దసరా పండుగ సందర్భంగా ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీలోని పాఠశాలలకు 11 రోజుల పాటు సెలవులు ప్రకటించింది. సెప్టెంబర్ 26 నుంచి అక్టోబర్ 6వ తేదీ వరకు ప్రభుత్వం దసరా సెలవులను ప్రకటించింది. 7వ తేదీ నుంచి పాఠశాలలు పున: ప్రారంభం కానున్నాయి. క్రిస్టియన్, మైనార్టీ పాఠశాలలకు మాత్రం అక్టోబర్ 1నుంచి 6వ తేదీ వరకు సెలవులను ప్రభుత్వం ప్రకటించింది.
Girl Saved: బాబోయ్..! క్షణం ఆలస్యమైనా చిన్నారి ఊపిరి ఆగేది.. ఈ వీడియోను చూస్తే చెమటలు పట్టాల్సిందే..
ఇదిలాఉంటే తెలంగాణలో ఇప్పటికే ప్రభుత్వం దసరా సెలువులు ప్రకటించింది. ఈ రాష్ట్రంలో సెప్టెంబర్ 26 నుంచి అక్టోబర్ 8వ తేదీ వరకు ప్రభుత్వ పాఠశాలలకు సెలవులు ఇస్తూ తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఈనెల 25, అక్టోబర్ 9న ఆదివారాలు కావటంతో తెలంగాణ రాష్ట్రంలో 15రోజులు పాఠశాలలకు సెలవులు కొనసాగనున్నాయి. తిరిగిన అక్టోబర్ 10న పున: ప్రారంభం అవుతాయి.
