Girl Saved: బాబోయ్..! క్షణం ఆలస్యమైనా చిన్నారి ఊపిరి ఆగేది.. ఈ వీడియోను చూస్తే చెమటలు పట్టాల్సిందే..

ఓ చిన్నారి రెప్పపాటు కాలంలో ప్రమాదం నుంచి బయటపడింది. సైకిల్ పై వేగంగా వచ్చిన చిన్నారి.. స్తంభాన్ని ఢీకొట్టే సమయంలో పక్కనే ఉన్న వ్యక్తి బాలికను పక్కకులాగి ప్రమాదం నుంచి కాపాడాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Girl Saved: బాబోయ్..! క్షణం ఆలస్యమైనా చిన్నారి ఊపిరి ఆగేది.. ఈ వీడియోను చూస్తే చెమటలు పట్టాల్సిందే..

Shocking Video

Girl Saved: చిన్న పిల్లలు ఆటలో పడితే చుట్టుపక్కల ఏం జరుగుతుందనే విషయాన్నికూడా పట్టించుకోరు. ముంచుకొచ్చే ప్రమాదాన్ని పసిగట్టలేక ప్రమాదాల బారిన పడుతుంటారు. అందుకే చిన్నపిల్లలు ఆటలాడుకొనేటప్పుడు తల్లిదండ్రులు ఓ కంటకనిపెడుతుంటారు. ముఖ్యంగా సైకిల్ రైడింగ్, రన్నింగ్ ఇలాంటి ఆటల సమయంలో జాగ్రత్తగా గమనిస్తుంటారు. వేగంగా వచ్చి కిందపడకుండా ఎప్పటికప్పుడు జాగ్రత్తలు చెబుతుంటారు. అయినా చిన్నపిల్లలు ప్రమాదాల భారిన పడుతూనే ఉంటారు. కొన్ని సందర్భాల్లో ప్రాణాలుసైతం కోల్పోయిన ఘటనలు ఉన్నాయి. తాజాగా.. సోషల్ మీడియాలో వైరల్ గా మారిన వీడియోలో రెప్పపాటు కాలంలో ఓ చిన్నారి ప్రాణాలతో భయటపడింది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు బాబోయ్ అంటూ.. ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Horse Running In Tamilnadu: అమ్మకోసం పరుగు..! బస్సుపై గుర్రం బొమ్మ.. తన తల్లే అనుకొని పరుగెత్తుకుంటూ వెళ్లిన పిల్ల గుర్రం.. వీడియో వైరల్

సోషల్ మీడియాలో వైరల్ గా మారిన వీడియోను CCTV_IDIOTS అనే ఖాతాదారులు పోస్టు చేశారు. ఈ వీడియోలో రహదారి పక్కన ఫుట్ పాత్ పై ముగ్గురు పెద్దవారు, ఓ బాలుడు ఉన్నారు. ఓ వ్యక్తి కుర్చీలో కూర్చోగా మరో వ్యక్తి సైకిల్ పై కూర్చొని ఉన్నాడు. మరోవ్యక్తి ఫుట్ పాత్ పై నిలబడి వారితో మాట్లాడుతున్నాడు. వారిపక్కనే ఓ పొడవాటి స్తంభం ఉంది. ఈ క్రమంలో ఓ చిన్నారి రోడ్డు మధ్యలో నుంచి సైకిల్ పై వేగంగా దూసుకొచ్చింది. నేరుగా స్తంభం వైపు వేగంగా వస్తుండటంతో దీనిని గమనించిన సైకిల్ పై వ్యక్తి సైకిల్‌ను పక్కకు పడేసి వాయువేగంతో వెళ్లి ఆ సైకిల్ స్తంభానికి తాకే సమయంలో బాలికను పక్కకు లాగాడు. రెప్పపాటు కాలంలో బాలిక ప్రాణాప్రాయం నుంచి తప్పించుకుంది.

ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియో పోస్టు చేసిన కొద్ది గంటల్లోనే వేలాది మంది వీక్షించారు. వీడియోను చూసి బాబోయ్.. ఈ పాపకు భూమిపై నూకలున్నాయి అంటూ కొందరు నెటిజన్లు పేర్కొంటుండగా.. మరికొందరు.. బాలికను ప్రమాదం నుంచి కాపాడిన వ్యక్తికి హ్యాట్సాప్ చెబుతూ రీ ట్వీట్లు చేశారు. ఇలాంటి ప్రమాదాల భారిన మన చిన్నారులు పడకుండా ఉండాలంటే వారు ఆటలాడేటప్పుడు గమనిస్తూ ఉండాలని, ఎప్పటికప్పుడు జాగ్రత్తలు చెబుతూ వారిని అలర్ట్ చేస్తుండాలని మరికొందరు నెటిజన్లు సూచించారు.