పోలీసుల కళ్లముందే: ఇసుక లారీ అడ్డుకున్నాడని యువకుడికి గుండు గీసి దాడి చేసిన దుండగులు

  • Publish Date - July 21, 2020 / 04:57 PM IST

తూర్పుగోదావరి జిల్లాలోని సీతానగరం మండలం వెదుళ్లపల్లిలో సభ్య సమాజం సిగ్గు పడే ఘటన జరిగింది. ఇసుక లారీని అడ్డుకున్నాడనే కారణంతో ఓ దళిత యువకుడికి కొంతమంది గుండు గీయించారు. అనంతరం దారుణంగా కొట్టారు. బూతులు తిడుతూ ఇష్టానుసారంగా కొట్టారు.

ఇదంతా అక్కడే ఉన్న పోలీసులు వేడుక చూస్తున్నట్లుగా ఉండిపోయారు తప్ప కనీసం అడ్డుకోలేదు. సదరు వ్యక్తులు యువకుడిని కొట్టటం..దారుణంగా తిట్టటం గుండు గీయించటం అంతా ఎస్సై ఫిరోజ్ కళ్లముందే జరిగింది. దీన్ని బట్టి పోలీసులు..కొంతమంది రాజకీయ నాయకుల అండతో ఈ దారుణం జరిగినట్లుగా తెలుస్తోంది. దీంతో సదరు బాదిత యువకుడు వారి నుంచి అతి కష్టం మీద తప్పించుకుని ఒళ్లంతా దెబ్బలతో హాస్పిటల్ కు వెళ్లాడు. ఈ దారుణ ఘటనపై సమాచారం అందుకున్న తూర్పుగోదావరి అర్బన్ ఎస్పీ ఎస్సై ఫిరోజ్ ను సస్పెండ్ చేశారు.