ఎవ్వరూ భయపడవద్దు : కరోనాని జయించిన రాజమండ్రి యువకుడు

  • Publish Date - April 3, 2020 / 06:05 AM IST

అతడు కరోనాను జయించాడు. వైరస్ పై పోరడాడు. సరైన వైద్యం తీసుకుంటే..ఏమీ చేయదని నిరూపించాడు తూర్పుగోదావరి జిల్లాకు చెందిన రాజమండ్రికి చెందిన వ్యక్తి. వైరస్ సోకడంతో మరణిస్తారనే భయం ఉన్న వారందరికీ ధైర్యం నింపాడు ఈ యువకుడు.

వైద్యుల సూచనలు పాటిస్తే వైరస్ నుంచి సులువుగా బయటపడవచ్చని యువకుడు వెల్లడించాడు. వైరస్ సోకితే..ఏమో అవుతుందని..ఆసుపత్రుల్లో సౌకర్యాలు ఉండవని చాలా మంది అపోహ పడుతున్నారని వ్యాఖ్యానించారు.

అయితే అలాంటిది ఏమీ లేదని, వైద్యులు తనను జాగ్రత్తగా చూసుకున్నారని వారికి కితాబిచ్చారు. తూర్పుగోదావరి జిల్లాలో మొత్తం 9 కేసులున్నాయి. అందులో ఈ యువకుడు బయటపడ్డాడు. పరీక్షల్లో రెండుసార్లు నెగటివ్ రావడంతో…వైద్యులు అతడిని 2020, ఏప్రిల్ 03వ తేదీ శుక్రవారం డిశ్చార్జ్ చేశారు. 

దుబాయ్ నుంచి ఇతను హైదరాబాద్ కు చేరుకున్నాడు. శంషాబాద్ నుంచి రాజమండ్రికి ప్లేన్ లో చేరుకున్నాడు. ఈ క్రమంలో అస్వస్థతకు గురయ్యాడు. వైద్యులను సంప్రదించగా…కరోనా లక్షణాలు వచ్చాయి. నమూనాలు సేకరించి తిరుపతి ల్యాబ్ కు పంపించారు.(నవ మాసాలు నిండిన గర్భిణీకి కరోనా పాజిటివ్‌)

పాజిటివ్ రావడంతో కాకినాడ జీజీహెచ్ ఆసుపత్రికి తరలించారు. ఐసోలేషన్ వార్డుకు తరలించి ట్రీట్ మెంట్ చేయడం ప్రారంభించారు. ఇతడి కుటుంబసభ్యులకు పరీక్షలు నిర్వహించగా..నెగటివ్ వచ్చింది. రెండుసార్లు టెస్ట్ చేశారు. అందులో నెగటివ్ వచ్చింది.(ఏపీపై కరోనా ఎఫెక్ట్: 161కి చేరుకున్న బాధితుల సంఖ్య)

మరో 14 రోజులు ఇంట్లోనే ఉండాలని వైద్యులు సూచించారు. ఎవరూ కరోనా వైరస్ మహమ్మారికి భయపడాల్సిన అవసరం లేదని మరోసారి స్పష్టం చేశాడు యువకుడు.