ఎన్నికల ఏర్పాట్లలో ఈసీ అధికారులు

సార్వత్రిక ఎన్నికలకు మరికొన్ని గంటలే సమయం ఉండటంతో... ఈసీ అధికారులు ఏర్పాట్లలో మునిగిపోయారు. ఈవీఎంలను పోలింగ్ కేంద్రాలకు తరలిస్తున్నారు.

  • Publish Date - April 10, 2019 / 04:18 AM IST

సార్వత్రిక ఎన్నికలకు మరికొన్ని గంటలే సమయం ఉండటంతో… ఈసీ అధికారులు ఏర్పాట్లలో మునిగిపోయారు. ఈవీఎంలను పోలింగ్ కేంద్రాలకు తరలిస్తున్నారు.

సార్వత్రిక ఎన్నికలకు మరికొన్ని గంటలే సమయం ఉండటంతో… ఈసీ అధికారులు ఏర్పాట్లలో మునిగిపోయారు. ఈవీఎంలను పోలింగ్ కేంద్రాలకు తరలిస్తున్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లో ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకున్నారు. పోలింగ్ సజావుగా జరిగేందుకు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నారు.

దేశవ్యాప్తంగా 20 రాష్ట్రాల్లో 91 స్థానాలకు పోలింగ్ జరగబోతోంది. ఇక ఏపీలో 25 పార్లమెంట్, 175 అసెంబ్లీ స్థానాలకు, తెలంగాణలో 17 పార్లమెంటరీ నియోజకవర్గాలకు రేపు ఎన్నికలు జరుగనున్నాయి. ఏపీ అసెంబ్లీ బరిలో 2వేల 118 మంది పోటీలో ఉండగా… లోక్‌సభ ఎన్నికల బరిలో 319 మంది ఉన్నారు. తెలంగాణ విషయానికి వస్తే… 17 స్థానాలకు మొత్తం 443 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. నిజామాబాద్ బరిలో 185మంది ఉన్నారు. 
Read Also : వీవీ ప్యాట్స్ లెక్కింపు : పొలిటికల్ పార్టీల్లో కొత్త ఆందోళన