Krishna River : శ్రీశైలానికి కృష్ణమ్మ.. ఎగువన నిండుతున్న డ్యామ్లు.. అన్నదాతల్లో చిగురిస్తున్న ఆశలు..
Jurala Release Flood Water To Srisailam Reservoir : జూరాల డ్యాంకు ప్రస్తుతం 18వేల క్యూసెక్కులు వచ్చి చేరుతోంది. నారాయణపూర్ నుంచి ఇన్ ఫ్లో భారీగా పెరగడంతో బుధవారం జూరాల నుంచి శ్రీశైలం డ్యాంకు కృష్ణమ్మ వరద వచ్చి చేరనుంది.
Jurala Release Flood Water As Krishna Inflows Rise Srisailam Reservoir Set For Heavy Surge
Jurala Release Flood Water to Srisailam Reservoir : ఎల్నినో ప్రభావంతో రైతులు ఆందోళన చెందుతున్న వేళ వారిలో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. జూరాల ప్రాజెక్టు ఎగువన కర్ణాటకలోని ఆలమట్టి, నారాయణపూర్ జలాశయాలు నిండుకుండలా కళకళలాడుతున్నాయి. దిగువన జూరాలకు నీరు విడుదలవుతోంది. ఈ ప్రవాహం బుధవారంకు శ్రీశైలం జలాశయానికి చేరుకుంటుందని అధికారులు చెబుతున్నారు.
Also Read : Tamil Nadu : రూ.15వేలు ఇస్తామని మహిళలకు గుండు గీయించిన వ్యక్తి.. చివరిలో బిగ్ ట్విస్ట్..
జూన్, జులై నెలల్లో ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడవంలో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే సరియైన వర్షాలు లేక సాగు పనుల్లో పూర్తిస్థాయిలో నిమ్మగం కాలేకపోతున్నారు. నాటిన విత్తనాలుసైతం మొలకెత్తని పరిస్థితి. అయితే, తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో రైతుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. ఇదే సమయంలో ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. దీంతో శ్రీశైలంకు వరద నీరు వచ్చి చేరుతోంది. ఆలస్యంగానైనా వరద ప్రారంభం కావడం, అటు తుంగభద్ర జలాశయానికీ వరద కొనసాగుతుండటంతో రాయలసీమ రైతుల్లో సాగు ఆశలు చిగురించాయి.
కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాల్లో, కృష్ణా పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు ఆలమట్టి డ్యాంకు పెద్దఎత్తున వరద వస్తోంది. అయితే, మంగళవారం సాయంత్రంకు 80 వేల క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు. నారాయణపూర్ నుంచి జూరాల డ్యామ్ వైపు వరదనీరు భారీగా వచ్చి చేరుతోంది. జూరాల డ్యాంకు ప్రస్తుతం 18వేల క్యూసెక్కులు వచ్చి చేరుతోంది. నారాయణపూర్ నుంచి ఇన్ ఫ్లో భారీగా పెరగడంతో బుధవారం జూరాల నుంచి శ్రీశైలం డ్యాంకు కృష్ణమ్మ వరద వచ్చి చేరనుంది. ఇప్పటికే జూరాల ప్రాజెక్టు వద్ద మంగళవారం సాయంత్రం 6గంటల సమయంలో విద్యుత్ కేంద్రం ద్వారా 30వేల క్యూసెక్కులు విడుదల చేశారు.
ఎల్నినో ప్రభావం కారణంగా తెలంగాణ 33శాతం వర్షపాత లోటును ఎదుర్కొంటున్న తరుణంలో ఈ పరిణామాలు చోటుచేసుకున్నాయి. రాష్ట్రంలో జలాశయాల మట్టాలను గణనీయంగా పెంచడానికి వర్షపాతం సరిపోనప్పటికీ, కర్ణాటక, మహారాష్ట్రలలో కురిసిన భారీ వర్షాలు ఎగువన ఉన్న జలాశయాలను నింపి కీలకమైన జీవనాధారాన్ని అందించాయి. ఈ ప్రవాహాల వల్ల శ్రీశైలం జలాశయంలో నీటి లభ్యత క్రమంగా మెరుగుపడి, కొనసాగుతున్న ఖరీఫ్ సీజన్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల సాగునీటి, తాగునీటి అవసరాలకు ఉపశమనం లభిస్తుందని కూడా అంచనా వేస్తున్నారు.
