Andhra Pradesh : ఏపీలో ఘోర ప్రమాదం.. భారీ పేలుడు.. ఇద్దరు మృతి.. పలువురికి తీవ్ర గాయాలు
Andhra Pradesh : ఏపీలోని తిరుపతి జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా.. మరికొందరికి గాయాలయ్యాయి.
boiler exploded at TIL Healthcare industry In Tirupati
Andhra Pradesh : ఏపీలోని తిరుపతి జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. సత్యవేడులోని శ్రీ సిటీలో ఉన్న భారీ టిల్ హెల్త్‌కేర్ పరిశ్రమలో శనివారం ఉదయం బాయిలర్ ఒక్కసారిగా పేలి భారీగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా.. మరో ముగ్గురికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం చెన్నైలోని అపోలో ఆస్పత్రికి తరలించారు. ఉదయాన్నే భారీ పేలుడు సంభవించడంతో పరిశ్రమలో ఒక్కసారిగా కలకలం రేగింది.
Also Read : AP Weather : ఏపీ వైపు దూసుకొస్తున్న మరో వాయుగుండం.. వర్షాలపై వాతావరణ శాఖ కీలక అప్డేట్.. ఈ జిల్లాలకు అలర్ట్..
ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే అధికారులు, సహాయక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంలో మృతులను సత్యవేడు మండలం చెరివి గ్రామానికి చెందిన చిన్న మస్తాన్ (45), తమిళనాడులోని మాదరపాకానికి చెందిన రమేశ్ (45)గా గుర్తించారు.
ప్రమాదానికి గల కారణాలపై వివరాలు తెలియాల్సి ఉంది. ప్రమాద సమయంలో పరిశ్రమలో ఎంతమంది ఉన్నారు.. గాయపడిన వారు ఇంకా ఎవరైనా ఉన్నారా? అనే విషయాలపై స్పష్టత రావాల్సి ఉంది.
మంత్రి నారా లోకేశ్ దిగ్భ్రాంతి..
శ్రీ సిటీలోని ఓ ప్రైవేట్ పరిశ్రమలో జరిగిన ప్రమాదం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. బాయిలర్ పేలడంతో కార్మికులు మృతి చెందడం, పలువురు గాయపడటం అత్యంత విషాదకరమైన ఘటన. మృతుల ఆత్మలకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. తమ ఆత్మీయులను కోల్పోయిన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వారికి అత్యుత్తమ వైద్య చికిత్స అందేలా అధికారులు అన్ని చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అన్నివిధాలా అండగా ఉంటుందని నారా లోకేశ్ ఎక్స్ వేదికగా పేర్కొన్నారు.
