TDP MP Kesineni Chinni : టీడీపీ ఎంపీ కేశినేని చిన్ని సతీమణికి ఈడీ నోటీసులు.. ఎంపీ కీలక కామెంట్స్..
TDP MP Kesineni Chinni : టీడీపీ ఎంపీ కేశినేని చిన్ని సతీమణికి ఈడీ నోటీసులు ఇచ్చింది. ఈనెల 27వ తేదీన విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొంది.
- Harish Thanniru
- Updated on- May 25, 2026 / 11:52 AM IST
Vijayawada MP Kesineni Chinni’s wife
- ఎంపీ కేశినేని చిన్ని సతీమణికి ఈడీ నోటీసులు
- నోటీసులపై క్లారిటీ ఇచ్చిన ఎంపీ కేశినేని చిన్ని
- కంపెనీకి నోటీసు వచ్చిందే తప్ప నా భార్యకు కాదని వెల్లడి
TDP MP Kesineni Chinni : టీడీపీ ఎంపీ కేశినేని చిన్ని సతీమణికి ఈడీ నోటీసులు ఇచ్చింది. ఈనెల 27వ తేదీన విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొంది. ఫ్రైడ్ ఇన్‌ఫ్రాకాన్ ఎల్ఎల్‌పీ కంపెనీతో రాజ్ కసిరెడ్డి లింకులపై ఈడీ ఆరా తీసింది. లిక్కర్ స్కామ్ లాభాల్లో షేర్ ఉన్నట్లు ఈడీ అనుమానం వ్యక్తం చేస్తోంది. గతంలోనూ కేశినేని సతీమణి జానకిలక్ష్మీకి ఈడీ సమన్లు జారీ చేసిన విషయం తెలిసిందే. తాజాగా మరోసారి ఈడీ సమన్లు జారీ చేసింది.
ఈడీ నోటీసులపై ఎంపీ కేశినేని చిన్ని స్పందించారు. ఆయన 10టీవీతో మాట్లాడారు. లిక్కర్ స్కాంలో నా మీద బురదచల్లే ప్రయత్నం చేస్తున్నారు. ఆరోపణలు వాస్తవాలు అని రుజువు చేస్తే రాజీనామా చేసేందుకు సిద్ధం. వైసీపీ నాయకుల అరాచకాలను, దుర్మార్గాలను అడుగడుగునా ప్రశ్నిస్తున్నాననే నాపై దుష్ప్రచారం చేస్తున్నారు. ఇశాన్వీ, కేశినేని డెవలపర్స్ సంస్థలు కలిసి చేసిన రియల్ ఎస్టేట్ సంస్థకు ఈడీ నుంచి ఓ నోటీసు వచ్చింది. కంపెనీకి వచ్చిన నోటీసుపై ఈనెల 27వ తేదీన వివరణ ఇస్తామని కేశినేని అన్నారు.
పక్కపక్క సైట్లు ఉండటంతో రాజ్ కేసిరెడ్డికి సంబంధించిన ఇశాన్వీ సంస్థతో 2021లో రియల్ ఎస్టేట్ చేసేందుకు ప్రైడ్ ఇన్ఫ్రా సంస్థ ఏర్పాటు చేశాం. ఆ సంస్థ ద్వారా రూ.35లక్షల లావాదేవీలు జరిగాయి. రాజ్ కేసిరెడ్డి సంగతి తెలిశాక 2022లోనే కంపెనీ నుంచి బయటకు వచ్చేశాం. ఆ లావాదేవీకి సంబంధించే ఈడీ సమాధానం కోరుతూ నోటీసు పంపింది. ఆర్కిటెక్ ఫీజ్ కోసం చేసిన రూ.35లక్షల ట్రాన్సాక్షన్ తప్ప ఇంకేం జరగలేదనే సమాధానమే ఈడీకి ఇవ్వనున్నామని కేశినేని చిన్ని పేర్కొన్నారు.
లిక్కర్ స్కామ్ లో నా భార్యకు నోటీసులు వచ్చినట్లు అవాస్తవం. అప్పుడు పెట్టిన కంపెనీలో నా భార్య ఒక డైరెక్టర్ మాత్రమే. కంపెనీకి నోటీసు వచ్చిందే తప్ప నా భార్యకు ఎలాంటి నోటీసు రాలేదని కేశినేని చిన్న స్పష్టం చేశారు.
