Pawan Kalyan : గోదావరి పుష్కర ఘాట్లను పరిశీలించిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. గోదావరిలో పడవ ప్రయాణం.. వీడియో
Pawan Kalyan : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ రాజమహేంద్రవరంలో పర్యటించారు. వచ్చే ఏడాది జరగనున్న గోదావరి పుష్కరాలకోసం కొనసాగుతున్న ఏర్పాట్లను పవన్ స్వయంగా పరిశీలించారు.
Pawan Kalyan
Pawan Kalyan : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ రాజమహేంద్రవరంలో పర్యటించారు. వచ్చే ఏడాది జరగనున్న గోదావరి పుష్కరాలకోసం కొనసాగుతున్న ఏర్పాట్లను పవన్ స్వయంగా పరిశీలించారు. సోమవారం ఉదయం రాజమహేంద్రవరంలోని గోదావరి నది పుష్కర ఘాట్లను పరిశీలించిన పవన్.. ఘాట్ల వద్ద పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా స్థానికంగా జరుగుతున్న అభివృద్ధి పనుల గురించి తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కీర్తి పవన్ కల్యాణ్ కు వివరించారు. ఆ తరువాత పుష్కర్‌ఘాట్ నుంచి కోటిలింగాల రేవు వరకు పవన్ కల్యాణ్ బోటులో ప్రయాణించారు. పవన్ కల్యాణ్ వెంట మంత్రులు కందుల దుర్గేశ్, నాదెండ్ల మనోహర్, ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరితోపాటు పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. అఖండ గోదావరి ప్రాజెక్టు పనులను పవన్ కల్యాణ్ మంత్రి కందుల దుర్గేశ్ వివరించారు. గోదావరి కాలుష్య నివారణకు ఘాట్ల వెంట తీసుకోవాల్సిన చర్యలను పవన్ పరిశీలించారు.
