Petrol Diesel Prices Hiked : వాహనదారులకు బిగ్‌షాక్.. పదిరోజుల్లో నాల్గోసారి పెరిగిన పెట్రోల్, డీజిల్ రేటు.. ఈసారి భారీగా.. ఏపీ, తెలంగాణలో ధరలు ఇవే..
Petrol Diesel Prices Hiked : వాహనదారులకు మరోసారి బిగ్ షాక్. దేశవ్యాప్తంగా మళ్లీ పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. ఇప్పటికే గడిచిన పది రోజుల్లో మూడు సార్లు పెరిగిన ఇంధన ధరలు.. తాజాగా నాల్గోసారి పెరిగాయి.
Petrol Diesel Prices Hiked
- మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
- పెట్రోల్ పై రూ.2.61, డీజిల్ పై రూ.2.71 చొప్పున పెంపు
- పది రోజుల్లో లీటరు పెట్రోల్ పై రూ.8 పెరుగుదల
Petrol Diesel Prices Hiked : వాహనదారులకు మరోసారి బిగ్ షాక్. దేశవ్యాప్తంగా మళ్లీ పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. ఇప్పటికే గడిచిన పది రోజుల్లో మూడు సార్లు పెరిగిన ఇంధన ధరలు.. తాజాగా నాల్గోసారి పెరిగాయి. సోమవారం పెట్రోల్, డీజిల్ ధరలను భారీగా పెంచుతూ ప్రభుత్వ రంగ చమురు సంస్థలు నిర్ణయించాయి. లీటర్ పెట్రోల్ పై రూ.2.61, డీజిల్ పై రూ.2.71 చొప్పున పెంచేశాయి. దీంతో గడిచిన పది రోజుల్లో నాలుగు సార్లలో లీటరు పెట్రోల్ పై సుమారు రూ.8 పెరుగుదల చోటు చేసుకుంది. ప్రస్తుతం పెరిగిన ధరలు సోమవారం ఉదయం నుంచే అమల్లోకి వచ్చాయి.
పశ్చిమాసియాలో ఉద్రిక్తతల కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ముడి చమురు ధరలు పెరగడం, రూపాయి బలహీనపడటం వంటి పరిస్థితులు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల దిగుమతి ఖర్చులపై భారీగా ప్రభావం చూపాయి. దీంతో ఈ పెంపులు చోటు చేసుకుంటున్నాయని మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. పెట్రోల్, డీజిల్ ధరల పెంపుతో రవాణా ఖర్చుల్లో పెరుగుదల చోటు చేసుకుంటుంది. తద్వారా నిత్యావసర వస్తువుల ధరలపై ప్రభావం పడుతుంది. దీంతో వాహనదారులతోపాటు పేద, మధ్య తరగతి వర్గాలపై ఇంధన ధరల పెంపు తీవ్ర ఆర్థిక భారాన్ని మోపనుంది.
పెరిగిన ధరల ప్రకారం తెలుగు రాష్ట్రాల్లో ధరలను పరిశీలిస్తే..
♦ హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.115.58, డీజిల్ ధర రూ.113.74
♦ విజయవాడలో లీటర్ పెట్రోల్ ధర రూ.117.19, డీజిల్ ధర రూ.104.88
♦ గుంటూరులో లీటర్ పెట్రోల్ ధర రూ.117.59, డీజిల్ ధర రూ.105.28
♦ ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.102.12కు, లీటర్ డీజిల్ ధర రూ.95.20కి చేరుకుంది.
