తుఫాన్ ఎఫెక్ట్ : ఏపీలోని 4 జిల్లాలో ఎన్నికల కోడ్ సడలింపు

  • Publish Date - May 3, 2019 / 07:59 AM IST

ఎట్టకేలకు ఏపీ విషయంలో ఎన్నికల సంఘం దిగి వచ్చింది. నాలుగు జిల్లాలో ఎన్నికల కోడ్ తొలగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఢిల్లీ నుంచి ఏపీ రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఆదేశాలు వచ్చాయి. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి ఉత్తర్వులు జారీ చేశారు. తూర్పుగోదావరి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు మినహాయింపు ఇచ్చారు. ఫొని తుఫాన్ సహాయక, పునరావాస చర్యల కోసం ఎన్నికల కోడ్ సడలించినట్లు ఈసీ ప్రకటించింది.

ఫొని తుఫాన్ వల్ల తూర్పుగోదావరి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో భారీగా పంట నష్టం, ఆస్తి నష్టం జరిగింది. సహాయక చర్యలు మమ్ముం చేయాల్సివుంది. ప్రభుత్వ యంత్రాంగం, పార్టీలకతీతంగా ప్రజలు సహాయక కార్యక్రమాల్లో పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు. పార్టీ కార్యకర్తలు, నేతలు సహాయ చర్యల్లో పాల్గొనటానికి ఎన్నికల కోడ్ అడ్డంకిగా ఉంటుంది. ఆ అడ్డంకిని తొలగిస్తూ.. సహాయక చర్యలను ముమ్మరం చేసే దిశగా కేంద్ర ఎన్నికల సంఘం కార్యదర్శి.. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి లేఖ పంపారు.