ఏపీలో ఎన్నికల కమిషన్‌ పూర్తిగా విఫలం : రామకృష్ణ

  • Publish Date - May 12, 2019 / 11:32 AM IST

ఏపీలో ఎన్నికల కమిషన్‌ పూర్తిగా విఫలమైందని సీపీఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు. ఈసీ పక్షపాత ధోరణితో వ్యవహరిస్తోందన్నారు. కేబినెట్‌ సమావేశం పెట్టొద్దనడం, అధికారులు హాజరుకావొద్దని ఆంక్షలు పెట్టడం దారుణమని అన్నారు. బీజేపీ పాలిత ప్రాంతాల్లో కేబినెట్‌ సమావేశాలు నిర్వహించినప్పుడు అడ్డుచెప్పని ఈసీ…ఏపీలో ఎందుకు అడ్డుపడుతుందని రామకృష్ణ  ప్రశ్నించారు. ఆ రాష్ట్రాల్లో సమావేశాలు నిర్వహిస్తే లేని తప్పు… ఏపీలో నిర్వహిస్తే తప్పేంటని నిలదీసింది.