తిరుమలలో విద్యుత్‌ బస్‌ ట్రయల్‌ రన్‌ సక్సెస్‌

  • Publish Date - November 6, 2020 / 05:03 PM IST

electric bus trail run sucess in tirumala: తిరుమలలో విద్యుత్‌ బస్‌ ట్రయల్‌ రన్‌ సక్సెస్‌గా జరుగుతోంది. రెండో రోజు నిర్వహించిన ట్రయల్‌ రన్‌ కూడా విజయవంతంగా సాగింది. మొత్తం మూడు రోజులపాటు ఈ ట్రయల్‌ రన్‌ కొనసాగుతుంది. తిరుమల పవిత్రత, కాలుష్య నివారణలో భాగంగా తిరుపతి నుంచి తిరుమల వరకు ఎలక్ట్రిక్‌ బస్సులను నడపాలని టీటీడీ భావిస్తోంది.




ఇందులో భాగంగా…. విద్యుత్‌ బస్‌ ట్రయల్‌ రన్‌ను ఆర్టీసీ అధికారులు నిర్వహిస్తున్నారు. నిన్న(నవంబర్ 5,2020), ఇవాళ(నవంబర్ 6,2020) నిర్వహించిన ట్రయల్స్‌ సక్సెస్‌ అయినట్టుగా అధికారులు చెబుతున్నారు. రేపు(నవంబర్ 7,2020) కూడా నిర్వహించి… నిర్ణయం తీసుకుంటామన్నారు. ఎలక్ట్రికల్‌ బస్‌ ట్రయల్స్‌లో డ్రైవర్ల అభిప్రాయాలను కూడా తీసుకుంటున్నట్టు వివరించారు.