×
Ad

Electric Scooter : బాబోయ్.. ఎలక్ట్రిక్ స్కూటర్‌లో మంటలు.. చూస్తుండగానే తగలబడిపోయింది

పెట్రోల్ ధరలు భగ్గుమంటున్న వేళ అందరి చూపు ఎలక్ట్రిక్ స్కూటర్ల పై పడింది. ఇలాంటి పరిస్థితుల్లో ఓ షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఎలక్ట్రిక్ స్కూటర్ లో మంటలు చెలరేగాయి. అంతా చూస్తుండగానే

  • Published On : October 16, 2021 / 07:34 PM IST

Electric Scooter

Electric Scooter : పెట్రోల్ ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. లీటర్ పెట్రోల్ ధర ఎప్పుడో సెంచరీ కొట్టేసింది. చుక్కలను తాకే ధరలు చూసి వాహనదారులు బెంబేలెత్తిపోతున్నారు. బండి బయటకు తీయాలంటేనే వణికిపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పెట్రోల్ బాధ లేని బ్యాటరీ వాహనాలపై అందరి చూపు పడింది. ఎలక్ట్రిక్ బైక్ లకు ఒక్కసారిగా డిమాండ్ పెరిగింది. పలు కంపెనీలు లేటేస్ట్ ఫీచర్లతో కొత్త కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లను మార్కెట్ లోకి విడుదల చేసి కస్టమర్లను అట్రాక్ట్ చేస్తున్నాయి. ప్రస్తుతం అంతా ఎలక్ట్రిక్ బైక్ కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ బండ్లకు పెట్రోల్ పోయాల్సిన బాధ ఉండదని, డబ్బు ఆదా చేయచ్చని భావిస్తున్నారు.

Power Cut : ఏపీలో రోజూ 4 గంటలు కరెంట్ కట్..? ఇందులో నిజమెంత

అయితే, ఇలాంటి పరిస్థితుల్లో ఓ షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఎలక్ట్రిక్ స్కూటర్ లో మంటలు చెలరేగాయి. అంతా చూస్తుండగానే నడి రోడ్డుపై మంటల్లో తగలబడిపోయింది.

గుంటూరు జిల్లా చిలకలూరిపేట పట్టణంలోని అడ్డరోడ్డు సెంటర్ లో ఈ ఘటన జరిగింది. ఓ వ్యక్తి ఎలక్ట్రిక్‌ స్కూటర్‌పై టెస్ట్ డ్రైవ్ కి వెళ్తుండగా అందులో ఒక్కసారిగా మంటలు వచ్చాయి. దీంతో భయాందోళకు గురైన వాహనదారుడు స్కూటర్‌ను అక్కడే వదిలేసి పరుగులు తీశాడు. చూస్తుండగానే మంటల్లో స్కూటర్‌ పూర్తిగా కాలిపోయింది. పెద్ద శబ్దంతో టైర్లు కూడా పేలాయి. దగ్ధమైన వాహనం విలువ రూ.65వేలు ఉంటుందని బాధితుడు తెలిపాడు.

Breakfast : ఉదయం బ్రేక్ ఫాస్ట్ మానేస్తే అనారోగ్య సమస్యలు తప్పవా?..

ఒక షోరూమ్‌ నుంచి ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ తీసుకొచ్చి డెమో నిమిత్తం టెస్ట్‌ డ్రైవ్‌ చేస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. ఈ ప్రమాదానికి సాంకేతిక లోపమే కారణం అని చెబుతున్నారు. కాగా, ఎలక్ట్రిక్ బైక్ లో మంటలు చెలరేగడం, పూర్తిగా తగలబడిపోవడం కలకలం రేపింది. గతంలోనూ తాడేపల్లిగూడెంలో ఇలానే ఓ ఎలక్ట్రిక్ స్కూటర్ మంటల్లో తగలబడిపోయిందని స్థానికులు చెప్పారు.