Power Cut : ఏపీలో రోజూ 4 గంటలు కరెంట్ కట్..? ఇందులో నిజమెంత

గ్రామాల్లో సాయంత్రం 6 నుంచి రాత్రి 10 గంటల వరకు, పట్టణాల్లో రాత్రి 9 నుంచి అర్థరాత్రి 12 గంటల వరకు, నగరాల్లో రాత్రి 11 నుంచి తెల్లవారుజామున 3 గంటల వరకు విద్యుత్ కోతలు..

Power Cut : ఏపీలో రోజూ 4 గంటలు కరెంట్ కట్..? ఇందులో నిజమెంత

Power Cut

Power Cut : సోషల్ మీడియా పుణ్యమా అని కొన్నిసార్లు అవాస్తవాలు వైరల్ అయిపోతున్నాయి. కొన్ని సందర్భాల్లో ఏది వాస్తవమో, ఏది అవాస్తవమో తెలియని పరిస్థితి నెలకొంది. అది నిజమో కాదో తెలుసుకోకుండానే జనాలు షేర్ చేస్తున్నారు. అది నిజమేనేమో అని నమ్మి ఆందోళన చెందుతున్నారు. తాజాగా ఏపీలో కరెంట్ కోతలకు సంబంధించి ఓ ప్రకటన వైరల్ గా మారింది. అది నిజమేనేమో అని నమ్మి అంతా ఆందోళన చెందుతున్నారు.

మ్యాటర్ ఏంటంటే.. ఏపీలో కరెంటు కోతలు విధిస్తున్నట్లు.. విద్యుత్ వినియోగదారులకు విజ్ఞప్తి అంటూ సోషల్ మీడియాలో ఓ ప్రకటన వైరల్‌గా మారింది. గ్రామాల్లో సాయంత్రం 6 నుంచి రాత్రి 10 గంటల వరకు, పట్టణాల్లో రాత్రి 9 నుంచి అర్థరాత్రి 12 గంటల వరకు, నగరాల్లో రాత్రి 11 నుంచి తెల్లవారుజామున 3 గంటల వరకు విద్యుత్ కోతలు ఉంటాయని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఇది నిజమేనేమో అని నమ్మి అంతా ఆందోళన చెందుతున్నారు.

Breakfast : ఉదయం బ్రేక్ ఫాస్ట్ మానేస్తే అనారోగ్య సమస్యలు తప్పవా?..

దీంతో చివరకు రాష్ట్ర ఇంధన శాఖ స్పందించాల్సి వచ్చింది. దసరా పండుగ తర్వాత గ్రామాలు, పట్టణాలు, నగరాల్లో లోడ్‌ రిలీఫ్‌ పేరిట గంటల కొద్దీ కరెంటు కోతలు ఉంటాయంటూ సోషల్ మీడియాలో వస్తున్న వదంతులను ఇంధనశాఖ ఖండించింది. ఆ ప్రకటనలో నిజం లేదని క్లారిటీ ఇచ్చింది. అలాంటి వదంతులు నమ్మొద్దని రాష్ట్ర ఇంధన శాఖ అధికారులు కోరారు. రాష్ట్రంలో కరెంటు కోతలు ఉండవని తెలిపింది. ఎలాంటి సమస్యలు లేకుండా విద్యుత్ అందిస్తున్నామని వివరించింది. తప్పుడు ప్రచారాలు నమ్మొద్దని విజ్ఞప్తి చేసింది. ప్రజలకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ ఆదేశించారని, విద్యుత్ సరఫరాలో ఎలాంటి అంతరాయం లేదని స్పష్టం చేశారు.

బొగ్గు లభ్యత, నిల్వలు, సరఫరా తదితర అంశాలు విద్యుత్ ఉత్పత్తిపై ప్రభావం చూపుతున్నాయని, ఇది ఏ ఒక్క రాష్ట్రానికో కాకుండా, అంతర్జాతీయంగా ఇలాంటి పరిస్థితులే నెలకొని ఉన్నాయని ఇంధన శాఖ స్పష్టం చేసింది. అయినప్పటికీ రాష్ట్రంలో నాణ్యమైన విద్యుత్ అందజేసేందుకు డిస్కంలు తీవ్రంగా శ్రమిస్తున్నాయని, దీనిపై సీఎం జగన్ కూడా ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని వివరించింది.

Kidney Stones : కిడ్నీల్లో రాళ్ళు ఎందుకొస్తాయంటే?

సీఎం జగన్ ఆదేశాలతో అత్యవసర ప్రణాళికల అమలు చేపట్టామని వెల్లడించింది ఇంధన శాఖ. ఏపీ జెన్‌కోకు బొగ్గు కొనుగోలు కోసం ప్రభుత్వం రూ. 250 కోట్లు కేటాయించిందని తెలిపింది. రాష్ట్రానికి అదనంగా రోజుకి దాదాపు 8 బొగ్గు రైళ్లు కేటాయించారంది. దేశంలో బొగ్గు లభ్యత ఎక్కడున్నా కొనుగోలు చేయాలని ఏపీ జెన్ కోకు ఆదేశాలు అందాయని క్లారిటీ ఇచ్చింది. మార్కెట్‌ ధర ఎంత ఉన్నా అత్యవసర ప్రాతిపదికన కొనాల్సిందిగా పంపిణీ సంస్థలకు ఆదేశించారని తెలిపింది. విద్యుత్‌ సంక్షోభంపై ఇటీవలే సమీక్ష నిర్వహించిన సీఎం జగన్‌.. విద్యుత్‌ సరఫరాకు అంతరాయం కలగకుండా అన్ని రకాల చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆదేశాలిచ్చిన సంగతి తెలిసిందే.