Explosion In Fireworks Center: బాణాసంచా తయారీ కేంద్రంలో పేలుడు.. నలుగురు సజీవదహనం

పశ్చిమ గోదావరి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. జిల్లాలోని తాడేపల్లిగూడెం సమీపంలో గల కడియద్ద వద్ద బాణాసంచా గోడౌన్‌లో భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడు ఘటనలో నలుగురు సజీవదహనం కాగా పదిమందికి గాయాలయ్యాయి.

Fire Accdient

Explosion In Fireworks Center: పశ్చిమ గోదావరి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. జిల్లాలోని తాడేపల్లిగూడెం సమీపంలో గల కడియద్ద వద్ద బాణాసంచా గోడౌన్‌లో భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడు ఘటనలో నలుగురు సజీవదహనం కాగా పదిమందికి గాయాలయ్యాయి. క్షతగాత్రుల్లో పలువురు పరిస్థితి విషమంగా ఉంది. పేలుడు సంభవించిన ప్రదేశంలో భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. నాలుగు ఫైరింజన్లు ఘటనా స్థలికి చేరుకొని మంటలను అదుపు చేస్తున్నాయి.

Cracker Factory Explosion: బాణాసంచా ఫ్యాక్టరీలో పేలుడు.. ఐదుగురు మృతి, 13 మందికి గాయాలు

పేలుడు ఘటనలో గాయపడ్డవారిని తాడేపల్లిగూడెం ఏరియా ఆస్పత్రికి తరలించారు. వారికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఒక్కసారిగా భారీ శబ్దాలు రావడంతో స్థానికులు భయబ్రాంతులకు గురయ్యారు.