Nara Lokesh
అమెరికాలో తనని అరెస్టు చేశారంటూ సామాజిక మాధ్యమాల్లో వైఎస్సార్టీపీ ప్రచారం చేస్తోందని టీడీపీ నేత నారా లోకేశ్ మండిపడ్డారు. హైదరాబాద్ నుంచి ఆయన అమరావతి చేరుకున్నారు. అనంతరం నారా లోకేశ్ మీడియాతో మాట్లాడారు.
అమెరికాలో నగదు అక్రమ చలామణీ కేసులో అరెస్ట్ అయింది జగనా? లేక అతని కుటుంబ సభ్యులా? అని లోకేశ్ అన్నారు. ఎవరు అరెస్టు అయ్యారో ప్రచారం చేస్తున్న గాడిదల్ని అడగండి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అందరూ జగన్‌లా ఉండరని చెప్పారు.
నగదు అక్రమ చలామణీ, వైట్ కాలర్ నేరాలు అన్నీ జగన్ కుటుంబాలకు తెలిసిన విద్యలేనని లోకేశ్ చురకలంటించారు. కాగా, పుట్టినరోజు నాడే అమెరికా లోకేశ్ అరెస్టయ్యారంటూ సామాజిక మాధ్యమాల్లో కొందరు ప్రచారం చేస్తున్నారు.
లోకేశ్ పోలీసుల అదుపులో ఉన్నారంటూ వార్తలు సృష్టిస్తున్నారు. అందుకే ఆయన పదిరోజులుగా ఎవరికీ కనపడడం లేదంటూ ప్రచారం చేస్తున్నారు. దీనిపైనే లోకేశ్ స్పందిస్తూ ఇవాళ కౌంటర్ ఇచ్చారు. ఏపీలో ఎన్నికలు దగ్గరపడుతుండడంతో సామాజిక మాధ్యమాల్లో టీడీపీ, వైసీపీ వార్ కూడా షురూ అయ్యింది.