Chandrababu Bail : బాబును చూసి బావోద్వేగానికి గురైన కుటుంబ సభ్యులు.. ఓదార్చి ధైర్యం చెప్పిన చంద్రబాబు.. ఫొటోలు వైరల్

బుధవారం ఉదయం 6గంటల సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఉండవల్లిలోని ఆయన నివాసానికి చేరుకున్నారు. సతీమణి నారా భువనేశ్వరి బాబుకు హారతి ఇచ్చి స్వాగతించారు.

Chandrababau naidu

Chandrababu Naidu : స్కిల్ డెవలప్ మెంట్ కేసులో అరెస్ట్ అయ్యి రాజమండ్రి సెంట్రల్ జైలుకు వెళ్లిన చంద్రబాబు.. హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో 52 రోజుల తరువాత బయటకు వచ్చారు.

టీడీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు ఆయనకు రాజమండ్రి సెంట్రల్ జైలు వద్ద ఘన స్వాగతం పలికారు.

మంగళవారం సాయంత్రం రాజమహేంద్ర వరం జైలు నుంచి విడుదలైన తరువాత రోడ్డు మార్గంలో ఉండవల్లిలోని నివాసానికి చంద్రబాబు బయలుదేరారు.

రాత్రంతా చంద్రబాబు ప్రయాణిస్తున్న మార్గంలో దారి పొడవునా టీడీపీ శ్రేణులు, అభిమానులు చంద్రబాబుకు ఘన స్వాగతం పలికారు.

భారీ సంఖ్యలో టీడీపీ శ్రేణులు, చంద్రబాబు అభిమానులు ఆయనకు స్వాగతం పలికేందుకు తరలిరావడంతో  ఉండవల్లిలోని నివాసానికి చేరుకోవటానికి సుమారు 13 గంటల సమయం పట్టింది.

బుధవారం ఉదయం 6గంటల సమయంలో చంద్రబాబు ఉండవల్లిలోని ఆయన నివాసానికి చేరుకున్నారు. సతీమణి నారా భువనేశ్వరి బాబుకు హారతి ఇచ్చి స్వాగతించారు.

చంద్రబాబు ఇంటికి చేరుకున్న సమయంలో కుటుంబ సభ్యులు, బంధువులు ఆయన్ను చూసి భావోద్వేగానికి గురయ్యారు. కన్నీరు పెట్టుకున్నారు.

చంద్రబాబు కుటుంబ సభ్యులు, బంధువులను దగ్గరకు తీసుకొని ఓదార్చారు. ధైర్యంగా ఉండాలని సూచించారు. ఈ క్రమంలో చంద్రబాబుసైతం ఒకింత భావోద్వేగానికి గురయ్యారు.