Feets of young people with bikes in Appikonda beach of Visakha
Visakha : విశాఖ జిల్లాలో ఆకతాయిలు రెచ్చిపోయారు. బీచ్ లో ఇష్టానుసారంగా బైక్ ఫీట్లతో పర్యాటకులను, స్థానికులను భయాందోళనలకు గురిచేస్తున్నారు. ప్రమాదకర ఫీట్లు చేస్తూ హీరోల్లా ఫీలైపోతు బీచ్ లకు వచ్చిన పర్యాటకులను హడలెత్తిస్తున్నారు. విశాఖ జిల్లా అప్పికొండ బీచ్ లో కొంతమంది ఆకతాయిలు బైకులతో ప్రమాకర ఫీట్లు చేస్తు హల్ చల్ చేశారు. ఆకతాయిల ఈ బైకు ఫీట్ల గురించి పోలీసులు ఏమాత్రం పట్టించుకోవట్లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.
ఆకతాయిల చేసే ఈ చర్యలకు పర్యాటకులు ఎవ్వరు అటువంటి రావటానికే భయపడుతున్నారు. స్పోర్ట్స్ బైకులతో ఇష్టానుసారంగా ఫీట్లు చేస్తున్నారు. ఇటువంటి ఘటనలు తరచు జరుగుతున్నాయని దీనిపై పోలీసులకు, అధికారులకు ఫిర్యాదులు చేసినా పట్టించుకోవటంలేదని వాపోతున్నారు స్థానికులు, పర్యాటకులు.
కాగా విశాఖ అంటే బీచ్ లే గుర్తుకొస్తాయి. విశాఖలో ఎన్ని పార్కులు ఉన్నా బీచ్ లో ఆడుకోవటానికి సేద తీరటానికి చాలామంది వస్తుంటారు. ముఖ్యంగా వీకెండ్ లో పర్యాటకులు విశాఖ జిల్లా వ్యాప్తంగా ఉండే బీచ్ లకు వస్తుంటారు. కానీ బీచ్ లు ఎంత ఆనందాన్ని ఇస్తాయో అప్పుడప్పుడు అలలు ప్రాణాలు కూడా తీస్తుంటాయి. అయితే ఇప్పుడు అలలు మాత్రమే కాదు ఆహ్లాదం కోసం బీచ్ కి వస్తే బైకులతో చేస్తున్న ఫీట్లతో హడలెత్తిస్తున్నారు ఆకతాయిలు.
ముగ్గురు యువకులకు పోలీసుల షాక్
విశాఖ అప్పికొండ బీచ్ లో బైకులపై ప్రమాదకర విన్యాసాలు చేసిన యువకులకు పోలీసులు షాక్ ఇచ్చారు. శ్రీనగర్ కు చెందిన అవినాష్, వర్మ, రోహిత్ లను అదుపులోకి తీసుకుని.. వారి బైకులను స్వాధీనం చేసుకున్నారు. రాష్ డ్రైవింగ్, రహదారులపై బైక్ విన్యాసాలు, స్టంట్స్ చేసినా.. ప్రజలకు ఇబ్బంది కలిగించినా కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.