Kankipadu Thieves
Female thieves: ఇంట్లో దొంగతనంచేస్తుండగా ఇంటికి వచ్చిన యజమానినే ఎవరు నువ్వని అడిగి చోరీ చేస్తున్న కొత్తరకం దొంగను కంకిపాడు పోలీసులు అరెస్ట్ చేశారు. చోరీకి వచ్చి ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు ఇంట్లో టీవీ ఆన్ చేసి, ఫ్యాన్లు వేసి చోరి చేసుకుని ఉడాయించేందుకు కొత్తగాప్లాన్ చేసిమరీ చోరీ చేస్తున్నారు ఈ అత్తా కోడళ్లు. వివరాల్లోకి వెళితే..
కృష్ణాజిల్లా కంకిపాడు.. బస్టాండ్ దగ్గరలో నివసించే ఆటోడ్రైవర్ పచ్చిపాల కోటేశ్వరరావు తన ఇంటికి గడియపెట్టి పనులపై బయటకు వెళ్ళాడు. అదే సమయంలో చోరీకి వచ్చిన విజయవాడ మాచవరానికి చెందిన బోయపాటి ధనలక్ష్మి, ఆమె కోడలు సాత్వితలు … గడియపెట్టి ఉన్న కోటేశ్వరరావు ఇంట్లో చోరీకి యత్నించారు.
సొంత మనుషుల్లాగా గడియతీసుకువెళ్లి ఇంట్లో టీవీ ఆనే చేసి…ఇంట్లో మనుషులు ఉన్నట్లు ఫ్యాన్ వేసి చోరీ మొదలెట్టారు. బయటకు వెళ్లిన కోటేశ్వరరావు ఇంటికి తిరిగి వచ్చాడు. వచ్చేసరికి ఇంటి తలుపులు తీసి ఉండటం, టీవీ ఆన్ చేసి ఉండటం, ఫ్యాన్లువేసి ఉండటం గమనించాడు. వెంటనే ఇంటి చుట్టుపక్కల వాళ్లను అందరినీ అలర్ట్ చేసి పిలిచి ఇంటి చుట్టూ రెడీ చేసాడు.
అందరూ రాగానే అతను లోపలికి వెళ్లాడు. కోటశ్వరరావును చూసిన మహిళలిద్దరూ ఏమీ తడబడకుండా ఎవరు మీరు…మా ఇంట్లోకి ఎందుకు వచ్చారుఅంటూ ఎదురు ప్రశ్నించే సరికి ఖంగుతున్నాడు. తేరుకుని నా ఇంట్లోకి వచ్చే నన్నే ఎవరని అడుగుతారా అని గట్టిగా గద్దించే సరికి అతడ్ని చేయిపట్టుకుని లోపలకు లాగాలని ప్రయత్నించారు. వారిని విదిలించుకుని కోటేశ్వరరావు బయటకు వచ్చాడు.
అతనితో పాటు బయటకు వచ్చిన మహిళలను.. అప్పటికే అక్కడకు చేరుకున్న చుట్టుపక్కలవారందరూ నిర్బంధించి పట్టుకున్నారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్ధలానికి వచ్చి ఇద్దరు మహిళా దొంగలను అదుపులోకి తీసుకున్నారు. వారు దొంగిలించిన వస్తువలను స్వాధీనం చేసుకున్నారు.
మహిళా దొంగలిద్దరూ అత్తా కొడళ్లు అవుతారు.కోడలు నెల రోజుల క్రితం సాత్విత పాపకు జన్మనిచ్చింది. వీరి వెంట ఉన్న పాప డైపర్ లో కూడా కొన్ని బంగారు ఆభరణాలు దాచటంతో అంతా ఆశ్చర్యానికి గురయ్యారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.